ETV Bharat / entertainment

స్టార్​ హీరో కూతురిపై ట్రోలింగ్​.. ఆ పని చేసినందుకే!

author img

By

Published : Dec 26, 2022, 6:30 PM IST

ఓ బాలీవుడ్​ స్టార్​ హీరో కుమార్తె వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. అందులో ఆమె వేసుకున్న దుస్తులపై ట్రోలింగ్ జరుగుతోంది.

nysa devgan viral video
nysa devgan viral video

స్టార్​ హీరో కూతురిపై ట్రోలింగ్​.. ఆ పని చేసినందుకే!

బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, కాజోల్ కుమార్తె నైసా దేవగణ్ ఆదివారం ముంబయిలోని ఓ పబ్​లో తన ఫ్రెండ్స్​తో కలిసి క్రిస్మస్ పార్టీకి హాజరైంది. పార్టీ అనంతరం బయటకు రాగా ఫొటోగ్రాఫర్లు ఆమె చుట్టూ చేరి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆ తర్వాత వాటిని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. వాటిలో ఓ వీడియో వైరల్​గా మారింది. ఆ వీడియోలో నైసా దేవగణ్​ పింక్​ బాడీకాన్​ డ్రెస్సులో కనిపించింది. అయితే ఆ దుస్తులపై సోషల్​ మీడియాలో ట్రోలింగ్​ జరుగుతుంది. ఈ పార్టీకి నైసాతో పాటు మరికొంత మంది ప్రముఖుల పిల్లలు వచ్చారు.

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను పిల్లలు తప్పుగా ఉపయోగిస్తున్నారని.. వారిపై ఓ కన్నేసి ఉంచాలని ఓ నెటిజన్​ అన్నాడు. తల్లిదండ్రుల కష్టపడి సంపాదిస్తే పిల్లలు ఇలా ఖర్చు చేస్తున్నారని మరో నెటిజన్​ రాసుకొచ్చాడు.
అజయ్ దేవగణ్​, కాజోల్‌ దంపతులకు ఇద్దరు సంతానం. నైసా దేవగణ్​తో పాటు.. తొమ్మిదేళ్ల కుమారుడు యుగ్ దేవగణ్​ కూడా ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.