ETV Bharat / entertainment

Mahesh Babu Pooja Ceremony : సినిమా పూజా కార్యక్రమాలకు మహేశ్​ ఎప్పుడూ వెళ్లరు!.. ఎందుకో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 6:59 PM IST

Updated : Sep 15, 2023, 7:13 PM IST

Mahesh Babu Pooja Ceremony : సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు.. ఎప్పుడూ తన సినిమాల పూజా కార్యక్రమాలకు హాజరవ్వరు. అందుకు కారణమేమిటోనని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు..

Mahesh Babu Pooja Ceremony
Mahesh Babu Pooja Ceremony

Mahesh Babu Pooja Ceremony : సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు.. ప్రస్తుతం జిమ్​లో కుస్తీ పడుతున్నారు. వరుస వర్కౌట్లు చేస్తున్న ఫొటోలను పోస్ట్​ చేస్తున్నారు. నాలుగు పదుల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిగా ఫిట్​నెస్​ మెయింటైన్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లి వచ్చిన మహేశ్​.. గుంటూరు కారం చిత్రం షూటింగ్​ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. తాజాగా మహేశ్​ బాబు సెంటిమెంట్​కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్​లో చక్కర్లు కొడుతోంది.

చైల్డ్ ఆర్టిస్ట్​గా అరంగేట్రం చేసి హీరోగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న మహేశ్​ బాబు.. ఇప్పటివరకు దాదాపు 25 చిత్రాల్లో నటించారు. ఎన్నో సూపర్ హిట్స్​ను తన ఖాతాలో వేసుకున్న మహేశ్​కు తన కెరీర్​లో కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయట. ఈ విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా మహేశ్​ తన సినిమాల పూజా కార్యక్రమాలకు హజరుకారు. ఇప్పటి వరకు ఒక్క సినిమా పూజా కార్యక్రమానికి హాజరుకాలేదట. ఈ సెంటిమెంట్​ను ఆయన తన తొలి సినిమా నుంచే అనుసరిస్తున్నారట. ఆయనకు బదులుగా సతీమణి నమ్రతా శిరోద్కర్​ లేదా పిల్లలు గౌతమ్, సితార పూజా కార్యక్రమానికి హాజరవుతారు.

అయితే మహేశ్ ఫాలో అవుతున్న ఈ సెంటిమెంట్‌కు కారణం మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ఆయన గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు మహేశ్​. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేశ్​ ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఇందులో మీనాక్షీ చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు మహేశ్​.

Mahesh Rajamouli Movie Hollywood Actors : అయితే మహేశ్​- రాజమౌళి కాంబోలో మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. జక్కన్న తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కూడా తాను ఇస్తున్న ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్​ విషయాన్ని చెబుతూ సినిమాపై హైప్​ పెంచుతున్నారు. తాజాగా ఆయన మరో విషయాన్ని చెప్పి.. మహేశ్‌ అభిమానుల్లో ఫుల్​ జోష్‌ నింపారు. అదేంటో తెలియాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

Mahesh Babu Son Gautham : గౌతమ్ గొప్ప మనసు.. సోషల్​మీడియాలో ఇప్పుడిదే ట్రెండింగ్​.. ఏం చేశాడో తెలుసా?

Mahesh Babu Shahrukh Khan : మహేశ్-షారుక్​ ఫన్నీ కన్వర్జేషన్ చదివారా?​.. ఇద్దరు కలిసి అలా చేస్తారట!

Last Updated : Sep 15, 2023, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.