ETV Bharat / entertainment

Jr NTR Devara : పులితో గేమ్ కంప్లీట్.. ఇప్పుడు సొర చేపతో 'దేవర' ఢీ!

author img

By

Published : Aug 7, 2023, 4:43 PM IST

Jr NTR Devara : జూ. ఎన్​టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న చిత్రం దేవర. అయితే ఈ సినిమా షూటింగ్​ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్​ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే?

Jr NTR Devara
దేవర అర్​డేట్

Jr NTR Devara : టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్​టీఆర్​ ప్రస్తుతం 'దేవర' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను పాన్ఇండియా రేంజ్​లో తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సినీవర్గాల్లో హాట్​టాపిక్​గా మారింది. మరి అదేంటంటే?

నటనతో బీభత్సం సృష్టించే ఎన్​టీఆర్..​ 'ఆర్​ఆర్​ఆర్​' సినిమాలో పులితో ఫైట్ చేయడం చూశాం. ఆ సీన్​కు ఫ్యాన్స్​ కేరింతలకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. కాగా తాజాగా డైరెక్టర్ కొరటాల శివ.. అలాంటి ఫైట్​ సన్నివేశాన్ని 'దేవర' మూవీలోనూ తెరకెక్కించాలనుకుంటున్నారని టాక్. అయితే దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్​టీఆర్​తో నేలపై తిరిగే పులితో ఫైట్​ చేయిస్తే.. శివ మాత్రం సముద్రంలో తిరిగే అత్యంత ప్రమాదకర జీవి సొరచేపతో ఓ భారీ యాక్షన్ సీన్ తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట.

సముద్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాలో.. సొరచేపతో హీరో ఫైట్ చేసే సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు మూవీమేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సొరచేప ఎపిసోడ్​కు సంబంధించి ఫైట్​ సీన్స్ డిజైన్ చేస్తున్నారట. కానీ మూవీటీమ్ నుంచి మాత్రం ఈ విషయంపై ఎలాంటి అప్​డేట్ రాలేదు. కానీ ఒకవేళ ఇది నిజమైతే థియేటర్లలో రచ్చ రచ్చే అంటున్నారు ఎన్​టీఆర్ ఫ్యాన్స్.

'దేవర' సినిమాతో దివంగత తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సైఫ్ రాకతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఎన్​టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్​ బ్యానర్​లు సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న లో విడుదలకానుంది.

గతంలో ప్రభాస్..
Prabhas Chatrapathi : అయితే టాలీవుడ్​లో ఇదివరకే రెబల్ స్టార్ ప్రభాస్ 'ఛత్రపతి' సినిమాలో సొరతో ఫైట్ చేశారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ప్రభాస్ రేంజ్​ను ఇంకాస్త పెంచింది. ఈ సినిమాలో ప్రభాస్.. సొరచేపతో ఫైట్ సీన్​కు ఫ్యాన్స్​లో ఇప్పటికీ సపరేట్ ఫ్యాన్​బేస్ ఉంది.​

NTR Devara movie shooting : 'దేవర' కోసం ఎన్టీఆర్ అలా చేస్తున్నారా?​

సినిమాల్లోకి జూనియర్​ ఎన్టీఆర్ పెద్ద కొడుకు.. సితార పాపతో కలిసి.. నిజమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.