ETV Bharat / entertainment

Jawan Special Screening : తారల కోసం 'జవాన్​' స్పెషల్​ స్క్రీనింగ్​.. కత్రినా, దీపిక, సుహానా సందడి

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 10:11 AM IST

Updated : Sep 7, 2023, 4:53 PM IST

Jawan Special Screening
Jawan Special Screening

Jawan Special Screening : బాలీవుడ్ స్టార్​ షారుక్​ ఖాన్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన జవాన్​ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా రిలీజ్​కు ముందే ముంబయిలో సినీ తారల కోసం ఓ స్పెషల్​ స్క్రీనింగ్​ను ఏర్పాటు చేశారు. ఆ విశేషాలు మీ కోసం..

Jawan Special Screening : బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్​​- తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కిన సినిమా 'జవాన్‌'. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గురువారం థియేటర్లలో గ్రాండ్​గా విడుదలైంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్​, ట్రైలర్​ సినిమాకు ఓ రేంజ్​లో హైప్​ ఇవ్వగా.. ఫ్యాన్స్​ కూడా ఈ సినిమా రిలీజ్​ కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఈ క్రమంలో సినిమా చూసేందుకు ఫ్యాన్స్​.. ఉదయాన్నే థియేటర్లకు చేరుకుని సందడి చేశారు. భారీ కటౌట్లు ఏర్పాటు చేసిన అభిమానులు.. డ్యాన్స్​లు చేస్తూ కనువిందు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది.

ఇక అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు 'జవాన్​' చూసేందుకు థియేటర్లకు వెళ్లారు. సినిమా రిలీజ్​కు ముందు.. యష్ రాజ్ స్టూడియోలో బుధవారం సాయంత్రం ప్రత్యేక స్క్రీనింగ్​ ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్​లో పలువురు సినీ తారలు మెరిశారు. ఈ ఈవెంట్​కు షారుక్​తో పాటు ఆయన భార్య గౌరీ ఖాన్​, కుమార్తె సుహానా ఖాన్​ హాజరవ్వగా..​ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, కత్రినా కైఫ్​, స్టార్ హీరో హృతిక్ రోషన్ వచ్చారు.

'జవాన్' టైటిల్​ ట్రాక్​ పాడిన సింగర్ రాజ కుమారి, సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా, నిర్మాత ముఖేష్ ఛబ్రాతో పాటు ఇతర 'జవాన్' మూవీ టీమ్ మెంబర్స్ ఈ స్క్రీనింగ్​కు​ హాజరై సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్​ అవుతున్నాయి.

Jawan Cast : ముందునుంచి భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ.. వచ్చిన 'జవాన్' కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో షారుక్​ లుక్​ కొత్తగా ఉందని, యాక్షన్ సీన్స్ అదిరిపోయాని సినిమా చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో షారుక్​కు జోడీగా తమిళ లేడీ సూపర్ స్టార్.. నయనతార నటించారు. సీనియర్ నటి ప్రియమణి కీలక పాత్రలో మెరిశారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా.. రెడ్ చిల్లీస్ ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై గౌరీ ఖాన్ నిర్మించారు.

  • I have never seen this kind of craze for any movie star 💥⚡
    Amazing, Unbelievable 💥🥳
    Mass celebration is going on everywhere 🚩#Jawan pic.twitter.com/sMgTnpGpQa

    — 𝐁𝐚𝐛𝐚 𝐘𝐚𝐠𝐚 (@yagaa__) September 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Jawan Movie Interesting Facts : 'ఇన్నేళ్ల తర్వాత ఆమెపై రివెంజ్‌ తీర్చుకున్నాను'

Jawan Movie Telugu Review : 'జవాన్​'లో అన్ని షేడ్స్​.. షారుక్​ ప్రేక్షకులను మెప్పించారా ?

Last Updated :Sep 7, 2023, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.