ETV Bharat / entertainment

నూడిల్స్​ యాడ్​ కోసం ఏకంగా రూ.75 కోట్లు- దేశంలోనే కాస్ట్లీ​ యాడ్​గా!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 10:21 PM IST

Indias Most Costly Ad Ching Noodles
India Costly Advertisement

India Costly Advertisement : సాధారణంగా ఒక యాడ్ తీస్తే ఎంత ఖర్చవుతుంది? నటుల పారితోషికం, షూటింగ్ ఖర్చులు అన్నీ కలుపుకొని రూ.10 కోట్లు వరకు అవుతుంది. అయితే మన దేశంలో తీసిన ఒక యాడ్ కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంతకీ ఆ యాడ్ దేనికోసం తీశారో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం!

India Costly Advertisement : మీరు ఇప్పటి దాకా కాస్ట్​లీ సినిమాల గురించి విన్నారు. కానీ కాస్ట్లీ యాడ్స్​ గురించి విని ఉండరు. అదేంటి.. అలాంటి యాడ్స్ కూడా ఉంటాయా అంటే.. అవును ఉంటాయనే సమాధానం వస్తుంది. మామూలుగా ఒక యాడ్ తీస్తే మహా అయితే రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇంకా ఎక్కువంటే అన్నీ ఖర్చులు కలిపి రూ.10 కోట్ల వరకు అవుతుంది. కానీ, ఒక్క యాడ్ కోసం ఏకంగా రూ.75 కోట్లు ఖర్చుపెట్టారంటే మీరు నమ్ముతారా? అది కూడా మన భారత్​లోనే. చదవడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. ఆ యాడ్ కూడా ఎందుకు తీశారో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.!

మ్యాగీకి పోటీగా 'చింగ్​'!
కంపెనీలు తమ కార్లు, ఆభరణాలు, టీవీలు, సెల్ ఫోన్ల గురించి యాడ్స్ కోసం ఎంతో డబ్బును ఖర్చు చేస్తాయి. అయితే FMCG కంపెనీ అయిన మ్యాగీ(Maggi)కి పోటీగా తీసుకువచ్చిన 'చింగ్ నూడుల్స్' అనే ప్రోడక్ట్​​ కోసం ఏకంగా రూ.75 కోట్లను ఖర్చు చేసి యాడ్ చేయించుకుంది సంస్థ​. ఈ యాడ్​కు చెన్నై ఎక్స్​ప్రెస్ లాంటి హిట్ ఇచ్చి, ఇటీవలి కాలంలో బాలీవుడ్​లో యాక్షన్ సీక్వెన్స్​లో భారీ మార్పులు తీసుకొచ్చిన డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ యాడ్​కు ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్​ రాజ్​ ఫిల్మ్స్ సైతం మద్దతును తెలియజేసింది. అయితే ఈ యాడ్​లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్​వీర్ సింగ్​ నటించారు. నటుల పారితోషికం, ఉపయోగించిన వీఎఫ్ఎక్స్​ సహా ఇతరత్రా ఖర్చంతా కలిసి బడ్జెట్ రూ.75 కోట్లకు పెరిగింది.

యాడ్​లో సాంగ్​.. 2 గంటల్లో 20 లక్షల వ్యూస్​..
సాధారణంగా ఏ ప్రకటన అయినా.. మహా అయితే 2 నిమిషాలు ఉంటుంది. కానీ 'చింగ్ నూడుల్స్' యాడ్​ మాత్రం ఏకంగా 5 నిమిషాల 30 సెకన్ల నిడివితో ఉంది. పైగా ఇందులో ఒక పాట కూడా ఉండటం విశేషం. దీనికి 'రణ్​వీర్​ చింగ్ రిటర్న్స్' అనే టైటిల్​ను కూడా పెట్టారు. కాగా, 'మై నేమ్ ఈజ్ రణ్​వీర్​ చింగ్' యాడ్​గా ఇది బాగా పాపులరైంది. 2016 ఆగస్టు 28న టెలికాస్ట్ అయిన ఈ యాడ్.. విడుదలైన 2 గంటల్లోనే యూట్యూబ్​లో ఏకంగా 2 మిలియన్ల (20 లక్షలు) వ్యూస్​ను దక్కించుకుంది.

యాడ్​ తర్వాత అనూహ్యంగా పెరిగిన సేల్స్​..
'చింగ్ నూడుల్స్' యాడ్​లో రణ్​వీర్​తో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటించింది. అయితే ఈ యాడ్ విడుదలైన తర్వాతే ఆ కంపెనీ సేల్స్ 150 శాతం పెరగడం గమనార్హం. రణ్​వీర్​ యాక్టింగ్, పాపులారిటీ వల్లే ఇది సాధ్యమైందని పలువురి అభిప్రాయం. కొందరు బందిపోటు దొంగలు ప్రజల్ని నిర్భంధించి ఆహారం, నీరు వారికి దొరక్కుండా చేసే సమయంలో హీరో ఒక వాహనంపై వచ్చి వారిని ఓడించి అందులో ఉన్న నూడుల్స్ అందరికీ పంచి ఆకలి తీరుస్తాడు. ఇదే యాడ్ సారాంశం.

విరాట్​ను వెనక్కి నెట్టి..
రణ్​వీర్ సింగ్ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీగా నిలిచాడని కార్పొరేట్ ఇన్వెస్టిగేషన్ అండ్ రిస్క్ కన్సల్టింగ్ సంస్థ క్రోల్ వెల్లడించింది. అయితే గతేడాది ఈ స్థానాన్ని స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సంపాదించాడు. ప్రస్తుతం అతడ్ని అధిగమించి మోస్ట్ వ్యాల్యూడ్ సెలెబ్రిటీగా రణ్​వీర్​ నిలిచాడు. 'సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2022 'బియాండ్ ది మెయిన్ స్ట్రీమ్' నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం కోహ్లీ బ్రాండ్ విలువ 181.7 మిలియన్ డాలర్లకు చేరింది.

మృణాల్ ఠాకూర్​తో​ డేటింగ్​- క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్​ సింగర్​!

'యానిమల్'​ విత్​ 'లయన్'- అన్​స్టాపబుల్​ సెట్​లో రణ్​బీర్​- షూటింగ్​ కంప్లీట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.