ETV Bharat / entertainment

మృణాల్ ఠాకూర్​తో​ డేటింగ్​- క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్​ సింగర్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 3:47 PM IST

Updated : Nov 14, 2023, 3:55 PM IST

Mrunal Thakur Badshah Dating : బాలీవుడ్​ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌తో డేటింగ్​లో ఉన్నట్లు వస్తోన్న రూమర్స్​పై స్పందించారు ప్రముఖ బాలీవుడ్ సింగర్ బాద్‌షా. దీనిపై వివరణ ఇస్తూ ఇన్​స్టాలో ఓ నోట్‌ను పోస్ట్​ చేశారు.

Mrunal Thakur Badshah Dating
Mrunal Thakur Badshah Dating

Mrunal Thakur Badshah Dating : గత కొద్దిరోజులుగా 'సీతారామం' బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌.. ప్రముఖ సింగర్​తో డేటింగ్​లో ఉందంటూ వస్తోన్న వార్తలపై స్పందించారు ప్రముఖ బాలీవుడ్ గాయకుడు బాద్​షా. దీనిపై వివరణ ఇస్తూ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ ఇన్​స్టాగ్రామ్​లో ఓ నోట్​ను పోస్ట్​ చేశారు. తమ ఇద్దరి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అవి పూర్తిగా అవాస్తవం అని కొట్టి పారేశారు.

అసలేం జరిగిందంటే..?
దీపావళి సందర్భంగా బాలీవుడ్‌ ప్రముఖ నటి శిల్పా శెట్టి సెలబ్రిటీలకు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. ఈ వేడుకకు మృణాల్‌ ఠాకూర్‌, సింగర్‌ బాద్‌షా కూడా హాజరయ్యారు. ఇక్కడ శిల్పా శెట్టి, బాద్‌షాలతో కలిసి మృణాల్‌ పలు ఫొటోలు దిగారు. అనంతరం వాటిని తన ఇన్​స్టా హ్యాండిల్​లో షేర్​ చేస్తూ.. 'నాకు అత్యంత ఇష్టమైన వారు' అని క్యాప్షన్​ను కూడా జోడించారు.

Mrunal Thakur Badshah Dating
శిల్పాశెట్టి ఇచ్చిన దీపావళి పార్టీలో మృణాల్​, బాద్​షా

చేతిలో చేయి వేసి..
అయితే ఈ ఫొటోల్లో మృణాల్​.. బాద్​షాతో అత్యంత చనువుగా ఉంటూ కనిపించింది. పార్టీలో కలియతిరుగుతున్న సమయంలో ఇద్దరు చేతులు పట్టుకొని మరీ తిరుగుతూ కనిపించారు. ఇక పార్టీ అయిపోయాక కూడా ఇద్దరూ కలిసి ఒకే కారులో వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్​ మీడియాలో తెగ వైరల్​గా మారాయి. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ, ప్రేమలో పడ్డారంటూ జోరుగా ప్రచారం కూడా సాగింది. ఇది కాస్త వైరల్​గా మారడం వల్ల తాజాగా దీనిపై స్పందించారు బాద్​షా. 'డియర్‌ ఇంటర్నెట్‌.. మరోసారి నిరాశపరుస్తున్నందుకు క్షమించు, ప్రస్తుతం వస్తోన్న వార్తల్లో నిజం లేదు. అవి పూర్తిగా అవాస్తవం' అంటూ ఓ ఫన్నీ ఎమోజీని నోట్​కి యాడ్​ చేస్తు ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు. ఇక ఈ పోస్ట్​తో మృణాల్​పై వస్తోన్న రూమర్స్​కు చెక్​ పెట్టినట్లు అయింది.

Mrunal Thakur Dating Badshah Reaction
బాద్​షా ఇన్​స్టా స్టోరీ..

పెళ్లి వార్తలూ ట్రోల్​..
Mrunal Thakur Upcoming Movies : మృణాల్‌ పెళ్లిపై కూడా ఇటీవలే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిని ఖండిస్తూ ఆమె స్వయంగా ఓ వీడియోను కూడా విడుదల చేశారు. మృణాల్​ ఓ తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోనున్నారంటూ వచ్చిన వార్తలను ఆమె అప్పట్లోనే ఖండించారు. ఇక టాలీవుడ్​లో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ క్రేజ్​ను సంపాదించుకుంది ఈ బీటౌన్​ బ్యూటీ. 'సీతారామం' సినిమాతో పాన్ ఇండియా లెవెల్​లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నేచురల్​ స్టార్​ నానితో 'హాయ్​ నాన్న', రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి 'ఫ్యామిలీ స్టార్' సినిమాల్లో నటిస్తోంది.

పాలరాతి శిల్పంలా శ్రీలీల - ఆ కళ్లలో ఏదో మ్యాజిక్​ ఉందిగా!

మృణాల్​ ఠాకూర్​ డేటింగ్ రూమర్స్ - ఆ స్టార్​ ర్యాపర్​ చేతులు పట్టుకున్న 'సీతారామం' బ్యూటీ!

Last Updated : Nov 14, 2023, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.