ETV Bharat / entertainment

మృణాల్​ ఠాకూర్​ డేటింగ్ రూమర్స్ - ఆ స్టార్​ ర్యాపర్​ చేతులు పట్టుకున్న 'సీతారామం' బ్యూటీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 7:23 PM IST

Updated : Nov 13, 2023, 7:58 PM IST

Mrunal Thakur Dating Rumors : బాలీవుడ్​ బ్యూటీ మృణాల్​ ఠాకూర్​ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ చిన్నది ముంబయిలో జరిగిన ఓ పార్టీలో సందడి చేస్తూ కనిపించింది. అక్కడ ఓ స్టార్​ ర్యాపర్​ చేయి పట్టుకుని తిరిగింది. దీంతో ఫ్యాన్స్​ ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Mrunal Thakur Dating Rumors
Mrunal Thakur Dating Rumors

Mrunal Thakur Dating Rumors : వరుస సినిమాలతో టాలీవుడ్​లో సందడి చేస్తోంది బీటౌన్​ బ్యూటీ మృణాల్ ఠాకూర్. 'సీతారామం' సినిమాతో పాన్ ఇండియాలో ఫేమస్​ అయిున ఈ అమ్మడు.. ఆ తర్వాత నేచురల్​ స్టార్​ నానితో 'హాయ్​ నాన్న', రౌడీ హీరో విజయ్​ దేవరకొండతో 'ఫ్యామిలీ స్టార్' సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటి వరకు 'హాయ్​ నాన్న' ప్రమోషన్స్​లో సందడి చేసిన ఈ చిన్నది.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి నిర్వహించిన దీపావళి పార్టీలో మెరిసింది. గ్రీన్​ కలర్​ డ్రెస్​లో బుట్టబొమ్మలా ముస్తాబై వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. అయితే ఈ పార్టీలో మృణాల్​ చేసిన ఓ పని వల్ల ఇప్పుడు ఆమె నెట్టింట ట్రెండ్​ అవుతోంది.

శిల్పాశెట్టి పార్టీకి హాజరైన మృణాల్.. పార్టీలో కలియతిరుగుతున్న సమయంలో బాలీవుడ్ ర్యాపర్‌ బాద్‌షా చేయి పట్టుకుని కనిపించింది. పార్టీలో ఈ ఇద్దరూ కాసేపు అలానే తిరిగారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే కారులో వెళ్లారు. దీంతో ఇప్పుడు మృణాల్​ రిలేషన్​షిప్​ గురించి సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. ఆమె బాద్​షాతో డేటింగ్‌లో ఉందంటూ నెట్టింట ఫ్యాన్స్​ కామెంట్స్​ చేస్తున్నారు.

Mrunal Thakur Marriage : మరోవైపు ఇటీవలే మృణాల్ గురించి కొన్ని రోజుల క్రితం ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో ఆమె ఓ తెలుగు అబ్బాయిని పెళ్లాడనున్నారంటూ.. పలు వెబ్‌సైట్లలో కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వ్యవహారంపై మృణాల్ స్పందించింది. సోషల్ మీడియా ఓ వీడియో షేర్​ చేసి వాటన్నింటికీ చెక్ పెట్టారు. ' హాయ్! మీ హార్ట్ బ్రేక్ చేస్తున్నందుకు ఐయామ్ సో సారి గాయ్స్​.. నా ఫ్రెండ్స్​, డిజైనర్స్‌, రిలేటివ్స్ వరుసగా ఫోన్‌కాల్స్‌ చేసి తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావా? అని అడుగుతున్నారు. మరి అతడు ఎవరో నాక్కూడా తెలుసుకోవాలని ఉంది. ఈ ఫన్నీ రూమర్ గురించి ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. అయితే అబ్బాయిని మీరే వెతికి, కల్యాణ వేదిక, లోకేషన్ షేర్ చేయండి' అని మృణాల్ ఇన్​స్టాగ్రామ్ స్టోరీలో వీడియో షేర్​ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

Mrunal Thakur Latest Interview : 'ఆ ప్రశ్న నన్ను ఎప్పుడూ అడుగుతుంటారు'

Nani Mrunal Liplock : మృణాల్​ ఠాకూర్​తో​ లిప్ ​లాక్​.. హీరో నాని ఇంట్లో గొడవలు!

Last Updated : Nov 13, 2023, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.