ETV Bharat / entertainment

'హాయ్​ నాన్న' కోసం సోలో ప్రమోషన్స్ ​- నాని ఆ సక్సెస్​ ఫార్ములాను వాడుతున్నారా ?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2023, 1:01 PM IST

Updated : Nov 12, 2023, 1:28 PM IST

Hi Nanna Movie Promotions : నేచురల్​ స్టార్​ నాని- మృణాల్​ ఠాకూర్​ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'హాయ్​ నాన్న'. పాన్​ ఇండియా లెవెల్​లో ఈ సినిమా డిసెంబర్​ 7న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మూవీ టీమ్​ సినిమా ప్రమోషన్స్​ను ముమ్మరం చేసింది. అయితే హీరో నాని మాత్రం ఓ సక్సెస్ ఫార్ములాను ఉపయోగించున్నారట. ఇంతకీ అదేంటంటే..

Hi Nanna Movie Promotions
Hi Nanna Movie Promotions

Hi Nanna Movie Promotions : 'దసరా' సినిమాతో పాన్​ ఇండియా లెవెల్​లో గుర్తింపు పొందారు నేచురల్​ స్టార్​ నాని. తన 15 ఏళ్ల సినీ కెరీర్​లో ఆఫ్​ బీట్​ సినిమాలు చేసి టాలీవుడ్​ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్​ బేస్​ పెంచుకున్నారు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. 'జెర్సీ' సినిమాలో క్రికెటర్​లా కనిపించిన నాని.. నాన్న పాత్రతో అందరిని భావోద్వేగాలతో ముంచెత్తారు. ఆ సినిమాలో రోల్​కు ఆయన ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఆయన నాన్న రోల్​లో సిల్వర్​ స్క్రీన్​పై కనిపించనున్నారు. 'హాయ్​ నాన్న ' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్​తో రూపొందిన ఈ సినిమా డిసెంబర్​ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఇక సినిమా రిలీజ్​కు 30 రోజులే ఉన్నందున మూవీ టీమ్​ ప్రమోషన్స్​ను ముమ్మరం చేసింది. అయితే నాని ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. తన మూవీ ప్రమోషన్స్​ కోసం పలు రకాలుగా ప్రయత్నిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇప్పటికే ప్రమోషన్స్​లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు, షోలకు వెళ్లిన మూవీ టీమ్​.. ప్రచారంలో భాగంగా సందడి చేస్తూ కనిపిస్తోంది. తాజాగా ఓ కాలేజీ ఈవెంట్​లో హీరో నాని, హీరోయిన్​ మృణాల్​తో పాటు డైరెక్టర్​ శౌర్యువ్​, మ్యాజిక్​ డైరెక్టర్​ హేషమ్​ హాజరయ్యారు. కాసేపు ఫ్యాన్స్​తో ముచ్చటించి సందడి చేశారు. అంతే కాకుండా తమ సినిమాలోని 'అమ్మాడి' సాంగ్​ను ఆ వేదికపై విడుదల చేశారు. ఆ తర్వాత నుంచి నాని సోలో షో మొదలైంది. తాజాగా ఓ న్యూస్​ ఛానెల్​ నిర్వహించిన రౌండ్ టేబుల్​ సమావేశంలో నాని పాల్గొన్నారు. తన ప్రోఫషనల్​ ​ లైఫ్​తో పాటు సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇలా అన్ని ఈవెంట్లలోనూ నాని.. తన సినిమా గురించి వీలైనంత ప్రచారం చేస్తున్నారు. అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరోవైపు హీరోయిన్​ మృణాల్ ఠాకూర్​ ప్రస్తుతం 'ఫ్యామిలీ స్టార్​' మూవీ షూటింగ్​లో బిజీగా ఉన్నారు. దీంతో నాని ఒక్కరే ప్రమోషనల్ ఈవెంట్స్​లో కనిపిస్తున్నారు. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం నాని ఇప్పుడు ఈ ప్రమోషన్స్​ను మరో లెవల్​కు తీసుకెళ్లనున్నారట. 'దసరా' సినిమా కోసం ఎలాగైతే ముంబయి, చెన్నై, బెంగళూరు వెళ్లారో ఇప్పుడు 'హాయ్​ నాన్న' కోసం అలాగే వెళ్లనున్నారట. ఇక ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్​లోనూ తన మూవీని ప్రమోట్​ చేసేందుకు యూఎస్​ వెళ్లనున్నారట. ఇదంతా చూస్తుంటే నాని ఈ సినిమా కోసం ఎంత శ్రమిస్తున్నారో ఇట్టే అర్థమౌతుంది. ఇక ఈ సినిమా థియేటర్లలో ఏ మేరకు సెన్సేషన్​ చేయనుందో వేచి చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'పెద్ద డైరెక్టర్లతో సినిమాలు ఎందుకు చేయట్లేదు?'- హీరో నాని స్టన్నింగ్​ రిప్లై!

'అందుకే ఆ సినిమా గురించి పోస్ట్ చేశాను - దాన్ని మీరు మరోలా అర్థం చేసుకున్నారు '

Last Updated :Nov 12, 2023, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.