ETV Bharat / entertainment

కథ కుదిరే.. కలయిక అదిరే.. కొత్త సినిమాలతో టాలీవుడ్​ హీరోల హంగామా

author img

By

Published : Nov 11, 2022, 6:55 AM IST

tollywood heroes movie updates
tollywood heroes movie updates

టాలీవుడ్ హీరోలు క్రేజీ కాంబినేషన్స్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. సరికొత్త కథలతో సీనీ ఫ్యాన్స్​ను అలరించబోతున్నారు. ఇప్పటికే 'దసరా'తో సిద్ధంగా ఉన్న నాని మరో సినిమాకు కూడా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఇక యువసామ్రాట్​ నాగచైతన్య.. వెంకట్​ ప్రభు సినిమా ఖాయమైనట్లు సమాచారం. మరోవైపు శర్వానంద్, నితిన్​ క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం..

వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నా.. మరో మంచి కథ దొరికితే చాలు పచ్చజెండా ఊపేయాలని కొందరు. సినీ డైరీ ఖాళీ అయ్యేలోపు ఓ కొత్త కబురు వినిపించాలని మరికొందరు.. ఇలా కథానాయకులంతా కథల వేటలో తలమునకలై ఉన్నారు. ఇందులో కొన్ని ప్రాజెక్ట్‌లు ఇప్పటికే పక్కా అయినట్లు సమాచారం. అవి త్వరలోనే కార్యరూపంలోకి రానున్నట్లు తెలుస్తోంది.

.

నాని రొమాంటిక్‌ కామెడీ
కొత్త ప్రతిభను.. కొత్త కథల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు కథానాయకుడు నాని. ప్రస్తుతం ఆయన చేస్తున్న 'దసరా' ఇలాంటి ప్రయత్నమే. ఈ సినిమాతో శ్రీకాంత్‌ ఓదెల అనే కొత్త దర్శకుడ్ని తెరకు పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత నాని చేయనున్న కొత్త చిత్రం సైతం ఓ నూతన దర్శకుడే రూపొందించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొన్ని వెబ్‌సిరీస్‌లతో నిరూపించుకున్న శౌర్య అనే దర్శకుడు నానికి ఓ కథ వినిపించారని.. అది ఆయనకు నచ్చడంతో సినిమా చేసేందుకు అంగీకరించారని సమాచారం. ఇదొక భిన్నమైన రొమాంటిక్‌ కామెడీ చిత్రంలా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీన్ని చెరుకూరి మోహన్‌ నిర్మించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయని, 'దసరా' పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కుతుందని ప్రచారం వినిపిస్తోంది.

.

ఈనెలలోనే శ్రీకారం..
నాగచైతన్య కథానాయకుడిగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత చైతూ చేయనున్న చిత్రమేదన్నది ఇంత వరకు తేలలేదు. ఆయన కోసం పరశురామ్‌ ఓ కథ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపించినా.. ఆ తర్వాత దానిపై స్పష్టత రాలేదు. దీనికి తోడు ఇటీవల ఆయన బాలకృష్ణకు ఓ కథ వినిపించనున్నట్లు చెప్పడంతో చైతన్యతో సినిమా లేకపోవచ్చని ప్రచారం వినిపించింది. అయితే ఇప్పుడు నాగచైతన్య - పరశురామ్‌ల ప్రాజెక్ట్‌ ఖరారైనట్లు సమాచారం. దీన్ని 14రీల్స్‌ ప్లస్‌ పతాకంపై నిర్మించనున్నారు. వెంకట్‌ ప్రభు సినిమా పూర్తి కాగానే ఈ చిత్రం రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.

.

శర్వా సిద్ధమే
'ఒకే ఒక జీవితం' విజయం శర్వానంద్‌కు కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఈ జోష్‌లోనే ఆయన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కించారు. కానీ, అనూహ్యంగా ఆ చిత్రం ఆగిపోవడంతో మళ్లీ కథల వేటలో పడ్డారు శర్వా. ఈ క్రమంలోనే ఇప్పుడాయన ఓ కథకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. 'భలే మంచి రోజు', 'దేవదాస్‌', 'హీరో' చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య. ఆయన ఇటీవలే శర్వానంద్‌కు ఓ కొత్తదనం నిండిన కథ వినిపించినట్లు తెలిసింది. అది శర్వాకు బాగా నచ్చడంతో సినిమాకి పచ్చజెండా ఊపారని సమాచారం. అయితే దీన్ని ఎవరు నిర్మిస్తారన్నది తేలాల్సి ఉంది. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.

.

'భీష్మ' దర్శకుడితో..
నితిన్‌ వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అలాగే సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కాగా, ఇప్పుడాయన మరో దర్శకుడికి ఓకే చెప్పినట్లు తెలిసింది. 'భీష్మ' చిత్రంతో నితిన్‌కు విజయాన్ని అందించారు దర్శకుడు వెంకీ కుడుముల. ఈ కలయికలోనే ఇప్పుడు మరో సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. స్క్రిప్ట్‌ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌కు నితిన్‌ ఓకే చెప్పారని తెలిసింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది.

ఇవీ చదవండి : మెగా డాటర్​ నిహారిక టాటూ చూశారా? దాని అర్థం ఏంటో తెలుసా?

సమంత 'యశోద' సినిమా మధ్యలో అల్లరి నరేష్​.. అదేంటబ్బా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.