ETV Bharat / entertainment

'నన్ను టార్చర్​ పెడుతున్నారు'.. సమంత పోస్ట్ వైరల్​!

author img

By

Published : May 2, 2023, 10:54 AM IST

Updated : May 2, 2023, 11:43 AM IST

హీరోయిన్​ సమంత.. తనను టార్చర్​ పెడుతున్నారని పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం అది సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు..

Samantha
ఐస్​ బాత్​ టబ్​లో సమంత​.. టార్చర్​ పెడుతున్నారట!

హీరోయిన్ సమంత ప్రస్తుతం 'సిటాడెల్' అనే యాక్షన్ వెబ్​ సిరీస్​లో నటిస్తున్నారు. ఈ సిరీస్​ కోసం కఠినతరమైన స్టంట్స్ కూడా చేస్తున్నారు. ఆ మధ్య షూటింగ్​లో భాగంగా రెండు చేతులకు గాయాలైన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఓ కొత్త ఫొటోనూ పోస్ట్​ చేసి 'ఇట్స్​ టార్చర్ టైమ్' అని రాసుకొచ్చారు. ఐస్​ బాత్​ టబ్​లో కూర్చున్న ఫొటోను పోస్ట్ చేశారు. యాక్షన్​ సీన్స్​లో నటిస్తున్నట్లు చెప్పిన సామ్​.. టార్చర్​లా ఉందని.. రికవరీ కోసం ఇలా ఐస్​ బాత్​ టబ్​లో కూర్చొని ఉపశమనం​ పొందుతున్నట్లు వెల్లడించారు. మరి ఇంత కష్టపడుతున్న సమంతకు 'సిటాడెల్' ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

ఇకపోతే సిటాడెల్ ఇంటర్నేషనల్ వెబ్​సిరీస్​. ఇంగ్లీష్ వెర్షన్​లో ప్రియాంక చోప్రా నటించారు. ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా నటించిన సిరీస్​ ఏప్రిల్ 28న రిలీజై.. అమెజాన్​లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో బోల్డ్ కంటెంట్​ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ సన్నిహిత సన్నివేశాల్లో నటించేందుకు తాను చాలా ఇబ్బంది కూడా పడినట్లు ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చారు. ఇలాంటి బోల్డ్​ సీన్స్​.. ఇండియన్​ వెర్షన్ సిరీస్​లో వరుణ్ ధావన్-సమంత మధ్య కూడా ఉంటాయని అంటున్నారు. అయితే ఇండియన్ ఆడియన్స్​ను దృష్టిలో పెట్టుకొని కాస్త డోస్​ తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్​ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.

Samantha
ఐస్​ బాత్​ టబ్​లో సమంత​.. టార్చర్​ పెడుతున్నారట!

కాగా, సమంత ప్రస్తుతం 'సిటాడెల్' వెబ్​సిరీస్​తో పాటు సెన్సేషనల్ స్టార్​ విజయ్ దేవరకొండ చిత్రంలోనూ నటిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'ఖుషి' టైటిల్​తో రూపుదిద్దుకుంటోంది ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 1న సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. చాలా కాలం తర్వాత సామ్​-విజయ్​ లవ్ జోనర్​లో సినిమా చేస్తున్నారు. ఇందులో వీరిద్దరు సాఫ్ట్​వేర్​ ఇంజనీర్ పాత్రలో కనిపిస్తున్నారు. గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన మజిలీ చిత్రంలోనూ సమంత నటించారు. అది బాక్సాఫీస్​ ముందు సూపర్ హిట్​గా నిలిచింది. ఇకపోతే సామ్​.. రీసెంట్​గా గుణశేఖర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో శాకుంతలం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది కాస్త బాక్సాఫీస్​ ముందు డిజాస్టర్​గా నిలిచింది. కథ, విజువల్ ఎఫెక్ట్స్​పై ఫుల్ ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఆమె ఆశలన్నీ సిటాడెల్, ఖుషిపైనే ఉన్నాయి. చూడాలి మరి ఈ రెండు ఆడియెన్స్​ను ఎంత వరకు ఆకట్టుకుంటాయో.

ఇదీ చూడండి: మహిళల శరీరాలు విలువైనవి.. వాటిని దుస్తులతో సంరక్షిస్తేనే మంచిది : సల్మాన్​ ఖాన్​

Last Updated : May 2, 2023, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.