ETV Bharat / entertainment

ఇక రష్మిక కూడా అలా చేయబోతుందిగా!

author img

By

Published : Apr 3, 2023, 11:05 AM IST

Updated : Apr 3, 2023, 3:55 PM IST

నేషనల్ క్రష్ హీరోయిన్ రష్మిక.. మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చింది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్​ చిత్రాలతో సత్తా చాటగా.. ఇప్పుడా జాబితాలోకి రష్మిక కూడా చేరనుంది. ఆ వివరాలు..

Rashmika new movie
మరో కొత్త సినిమాకు రష్మిక గ్రీన్ సిగ్నల్

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు.. హీరోలతో పాటుగా ఫ్యాన్​ బేస్​ను క్రియేట్​ చేసుకుని వారిని అలరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కథానాయకులకు పోటీగా వారి పక్కన సినిమాలు చేస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్​ సినిమాలు చేస్తూ కెరీర్​లో టాప్ హీరోయిన్లుగా ఎదిగారు. తెలుగులో విజయశాంతి, నయనతార, అనుష్క, సమంత.. ఇలా పలువురు హీరోయిన్ల ఈ జాబితాలోనివారే. ఇప్పుడీ జాబితాలోకి హీరోయిన్ రష్మిక కూడా చేరబోతుంది.

'ఛలో' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కన్నడ బ్యూటీ, నేషనల్ క్రష్​ రష్మిక.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్​గా ఎదిగింది. అల్లు అర్జున్​ 'పుష్ప' చిత్రంతో మరింత క్రేజ్​ను పెంచుకుంది. ప్రస్తుతం సౌత్​లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్​లోనూ వరుస ఆఫర్లను అందుకుంటోంది. ఇటీవలే హిందీలో 'మిషన్ మజ్ను'తో.. తెలుగులో 'వారసుడు'తో ఆడియెన్స్​ను పలకరించింది. ఈ రెండు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ఈ అమ్మడు అందానికి అందరూ ఫిదా అయిపోయారు.

అయితే ఇప్పుడు 'పుష్ప 2' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్న ఈ భామ.. పలు సినిమాలకు గ్రీన్ ఇస్తోంది. తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించారు. 'రెయిన్​బో' అనే టైటిల్​తో ఉన్న పోస్టర్​ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో రూపొందిస్తున్నారు. ఈ విషయాన్ని డ్రీమ్​ వారియర్స్​ పిక్చర్స్​ నిర్మిస్తోంది. ఖైదీ, ఖాకీ లాంటి ఎన్నో హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేసింది ఈ నిర్మాణ సంస్థ. ఏప్రిల్ 7 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. శాంతారూబెన్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్​ చేయనున్నారు. మలయాళ యాక్టర్​ 'శాకుంతలం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్న దేవ్​ మోహన్​.. ఈ చిత్రంతో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకూర్చనున్నారు.

రష్మిక రెయిన్​బో సినిమా లాంఛ్​

ఇకపోతే రష్మిక త్వరలోనే హిందీలో సందీప్​ వంగా డైరెక్టర్​ చేసిన యానిమల్​ సినిమాతో థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో రణ్​బీర్​ కపూర్ హీరోగా నటించారు. అలానే ఈ ముద్దుగుమ్మ.. హీరో నితిన్- దర్శకుడు వెంకీ కుడుముల కలిసి ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది. అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన 'భీష్మ' సినిమా బాక్సాఫీస్​ వద్ద మంచి హిట్​గా నిలిచింది. దీంతో ఇప్పుడీ కాంబో మరోసారి రిపీట్ అవ్వడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవలే ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్​ చేశారు. అలానే మార్చి 31న గ్రాండ్​గా ప్రారంభమైన ఐపీఎల్ ఆరంభోత్సవ వేడుకల్లో స్టెప్పులేసి క్రికెట్ ఆడియెన్స్​ను అలరించింది. నాటు నాటు, శ్రీవల్లి, సామీ పాటలకు చిందులేసి ప్రేక్షకుల్లో జోష్​ను నింపింది.

Rashmika new movie
మరో కొత్త సినిమాకు రష్మిక గ్రీన్ సిగ్నల్

ఇదీ చూడండి: సినీ లవర్స్​ రెడీగా ఉన్నారా?.. 'రావణాసుర' టు 'శాకుంతలం'.. ఏప్రిల్​లో​ వచ్చే సినిమాలివే!

Last Updated : Apr 3, 2023, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.