ETV Bharat / entertainment

VFX వండర్స్​, BGM థండర్స్- హాలీవుడ్​ లెవెల్లో 'హనుమాన్' ట్రైలర్ ​

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 11:15 AM IST

Hanuman Trailer : టాలీవుడ్ యంగ్​ హీరో తేజ సజ్జ మోస్ట్​ వెయిటెడ్ 'హనుమాన్' ట్రైలర్ మంగళవారం రిలీజైంది. టీజర్​తో అంచనాల పెంచిన ఈ సినిమా ట్రైలర్​ను మీరు చూశారా?

hanuman trailer
hanuman trailer

Hanuman Trailer : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ - డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'హనుమాన్'. మైథలాజికల్ కాన్సెప్ట్​తో పూర్తి భిన్నంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే రీలీజైన టీజర్​తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచడంలో మూవీటీమ్ సక్సెస్ అయ్యింది. హాలీవుడ్ రేంజ్ వీఎఫ్​ఎక్స్, గ్రాండ్ స్క్రీన్ వర్క్స్ తో టీజర్​కు అశేష స్పందన లభించింది. కాగా మంగళవారం (డిసెంబర్ 19) మూవీటీమ్ ట్రైలర్​ను రిలీజ్ చేసింది. మీరు ఆ ట్రైలర్ చూశారా?

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

థియేటర్లలో​ గంట ముందుగానే : సినిమాకు వస్తున్న స్పందన దృష్టిలో ఉంచుకొని చిత్రయూనిట్, టీజర్ రిలీజ్​ను మరింత గ్రాండ్​గా ప్లాన్​ చేసింది. యూట్యూబ్​లో కంటే గంట ముందుగానే (10.08 AM), సెలెక్టెడ్ థియేటర్లలో ట్రైలర్ బొమ్మ పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 26 సెంటర్లలో ట్రైలర్ రిలీజైంది.

ఊహించని స్పందన వల్లే! : అయితే హనుమాన్ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది! కానీ, గతేడాది విడుదలైన టీజర్​కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభించింది. ప్రతి ఫ్రేమ్​లో డైరెక్టర్​ టీమ్ ఎఫర్ట్ కనిపించింది. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా ఔట్​పుట్​​పై మరింత ఫోకస్ చేశారు. సాధారణంగా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీల్లో హిందుత్వం, ఇతిహాసం (ఆదిపురుష్, కార్తికేయ) బేస్​ వస్తున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హై క్వాలిటీ వీఎఫ్​ఎక్స్​తో రిలీజైన 'హనుమాన్​ టీజర్'​కు బాలీవుడ్​ సైతం చర్చించుకునేంత అనూహ్య స్పందన వచ్చింది. దీంతో కాస్త ఆలస్యం అయినా, దర్శకుడు ప్రశాంత్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

Hanuman Cast : ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీ రోల్స్​లో నటించగా వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాత నిరంజన్​రెడ్డి ప్రైమ్​షో ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై సినిమాను రూపొందిస్తున్నారు. గౌరహరి, అనుదీప్‌ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్​గా సినిమా రిలీక్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'వచ్చాడు కొత్త సూపర్​ హీరో'- ఆకట్టుకునేలా 'హనుమాన్'​ ఫస్ట్​ సింగిల్!

8 సూపర్ హీరో కథలతో ప్రశాంత్​ వర్మ!.. బాలయ్యతో డిస్కషన్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.