ETV Bharat / entertainment

Gunturukaram Shooting : కొత్త సినిమాటోగ్రాఫర్​ వచ్చేశారు.. ఇక గురూజీకి సవాల్​!

author img

By

Published : Aug 17, 2023, 3:22 PM IST

Gunturukaram Shooting : ఎట్టకేలకు 'గుంటూరు కారం' షురూ.. కొత్త సినిమాటోగ్రాఫర్​ వచ్చేశారు!
Gunturukaram Shooting : ఎట్టకేలకు 'గుంటూరు కారం' షురూ.. కొత్త సినిమాటోగ్రాఫర్​ వచ్చేశారు!

Gunturukaram Shooting : గుంటూరు కారం షూటింగ్ ఎట్టకేలకు షురూ అయినట్లు తెలిసింది. కొత్త సినిమాటోగ్రాఫర్​తో షూట్ తీశారట. ఆ వివరాలు..

Gunturukaram Shooting : సూపర్ స్టార్ మహేశ్​ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. నిన్నటి వరకు బ్రేక్​లో ఉన్న 'గుంటూరు కారం' మూవీ షూటింగ్ ఎట్టకేలకు ప్రారంభమైనట్లు సమాచారం అందింది. నేడు(ఆగస్ట్ 17) హైదరాబాద్​లో షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభించారని తెలిసింది. కొత్త సినిమాటోగ్రాఫర్​ ఎవరనే సస్పెన్స్​ కూడా వీడింది.

గత కొంతకాలంగా గుంటూరు కారం చిత్రానికి పనిచేసిన సినిమాటోగ్రాఫర్​ పీఎస్​ వినోద్​ తప్పుకున్నారని ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద చర్చే సాగింది. అలాగే మహేశ్​ బాబు కూడా కుటుంబంతో కలిసి ఫారెన్ టూర్​కు వెళ్లడం, సినిమాటోగ్రాఫర్ లేకపోవడం వంటి కారణాలతో సినిమా చిత్రీకరణ కొద్ది రోజుల నుంచి నిలిచిపోయింది.

Gunturukaram New Cinematographer : దీంతో సినిమా ఎప్పుడు షురూ అవుతుందోనని అభిమానులు చాలా టెన్షన్ పడ్డారు. కొత్త సినిమాటోగ్రాఫర్ ఎవరు? అన్న ఆసక్తి కూడా అందరిలో ఎక్కువగా నెలకొంది. ఈ క్రమంలోనే కొత్త సినిమాటోగ్రాఫర్​గా మనోజ్ పరమహంస బాధ్యతలు తీసుకుంటారని వార్తలు కూడా వచ్చాయి. అలానే ఇప్పుడు.. ఆయనే సినిమాటోగ్రాఫర్​గా షూటింగ్ షురూ చేసింది మూవీటీమ్​. హైదరాబాద్​లో షూటింగ్​ జరిగిందట.

పరమహంస గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన విజువల్ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్​ టాలెంట్​ అద్భుతంగా ఉంటుంది. ఏమాయ చేశావే, రేసుగుర్రం, రాధేశ్యామ్​, బీస్ట్​ సహా పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్​గా పని చేశారు. ప్రస్తుతం దళపతి విజయ్​ లియోకు వర్క్​ చేస్తున్నారు. ఇప్పుడు గుంటూరు కారంకు చేస్తున్నారు.

అయితే కథ ఇక్కడే అయిపోలేదు. అసలు ఛాలెంజ్​ ఇప్పుడే మొదలైంది. ఈ సినిమాను మొదటి నుంచి వచ్చే ఏడాదికి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మూవీటీమ్ చెబుతోంది. అంటే మరో నాలుగు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేయాలి. ఈ భారమంత ఇక దర్శకుడు త్రివిక్రమ్​పైనే ఉంటుంది. చూడాలి మరి గురూజీ ఏం చేస్తారో. ఇకపోతే ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ అభిమానులను బాగానే ఆకట్టుకున్నాయి.

Gunturu Karam Shooting : హమ్మయ్యా.. 'గుంటూరు కారం'కు టైమ్ వచ్చింది.. ఏకంగా అన్ని కోట్ల భారీ సెట్​లో షూటింగ్?

Mahesh Babu Guntur Karam : 'గుంటూరు కారం' కొత్త పోస్టర్స్​.. ఏంది సార్ మళ్లీ ఈ కన్ఫ్యూజన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.