ETV Bharat / entertainment

Gunturu Karam Shooting : హమ్మయ్యా.. 'గుంటూరు కారం'కు టైమ్ వచ్చింది.. ఏకంగా అన్ని కోట్ల భారీ సెట్​లో షూటింగ్?

author img

By

Published : Aug 13, 2023, 6:07 PM IST

Updated : Aug 13, 2023, 7:24 PM IST

Gunturu Karam Shooting : గుంటూరు కారం సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఆ రోజు నుంచే షురూ కానుందట. ఇందుకోసం ఓ భారీ కాస్ట్లీ సెట్​ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.

Gunturu Karam Shooting
Gunturu Karam Shooting

Gunturu Karam Shooting : సూపర్ స్టార్ మహేశ్​ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్​గా రానున్న ఈ సినిమా మొదటి నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ షూటింగ్​ను పోస్ట్ పోన్​ చేసుకుంటూ వస్తోంది. సినిమాలోని నటీనటులు, టెక్నిషియన్స్​ కూడా బిగ్​బాస్ హౌస్ కెంటెస్టెంట్​ తరహాలో ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఎట్టకేలకు ఈ మూవీ షూటింగ్​ షురూ కానుందని తెలిసింది. ముందు నుంచి ప్రచారంలో ఉన్న ఆగస్ట్ 16వ తేదీ నుంచే కొత్త షెడ్యూల్ ప్రారంభించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన మహేశ్ కూడా వచ్చేస్తున్నారట. భారత్​కు రాగానే వెంటనే షూటింగ్​లో రీజాయిన్ అవ్వనున్నారని సమాచారం అందింది.

ఇకపోతే రీసెంట్​గా సినిమాటోగ్రాఫర్​ పీఎస్ వినోద్​ తప్పుకున్నట్లు ప్రచారం సాగింది. దీనిపై పెద్ద చర్చే సాగింది. అయితే ఇది కన్ఫామ్​ అని తెలుస్తోంది. ఎందుకంటే కొత్త సినిమాటోగ్రాఫర్​గా పీఎస్ వినోద్ స్థానంలో మనోజ్ పరమహంస ఛార్జ్ తీసుకుంటారని తెలిసింది. ఆగస్ట్​ 16న ప్రారంభంకాబోయే షూటింగ్​ను ఆయనే చిత్రీకరించబోతున్నారని సమాచారం అందింది.

సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్​ న్యూస్ కూడా బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ కొత్త షెడ్యూల్​ షూటింగ్​ను భారీ కాస్ట్లీ సెట్​లో షూట్​ చేయబోతున్నారని ఇన్​సైడ్​ టాక్​. ఓ ప్రైవేట్ స్టూడియోలో దాదాపు రూ.4కోట్ల ఖర్చుతో భారీ స్పెషల్​ సెట్​ నిర్మించబోతున్నారట. చాలా స్పెషల్​గా ఈ సెట్​ను తీర్చిదిద్దుతున్నారని అంటున్నారు. ఇందులోనే కొత్త షెడ్యూల్​ను షూట్​ చేయబోతున్నారని చెబుతున్నారు.

Gunturu Karam Release date: ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న శ్రీలీల, మీనాక్షి చౌదరితో పాటు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న నటీనటులపై ఈ కొత్త షెడ్యూల్​లో షూట్​ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇకపోతే తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్​ బ్యానర్​పై నిర్మిస్తోంది. ఇప్పటికే ఇటీవలే మహేశ్ బాబు బర్త్​డే సందర్భంగా రిలీజైన రెండు కొత్త మాస్​ పోస్టర్లు అభిమానులను, సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నారు.

Mahesh Babu Guntur Karam : 'గుంటూరు కారం' కొత్త పోస్టర్స్​.. ఏంది సార్ మళ్లీ ఈ కన్ఫ్యూజన్​!

Mahesh Babu Star Name : స్పేస్​కు చేరిన మహేశ్ క్రేజ్​.. ఆ నక్షత్రానికి..

Last Updated : Aug 13, 2023, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.