ETV Bharat / entertainment

మహేశ్, శ్రీలీల ఫుల్ మాస్ డ్యాన్స్- 'కుర్చీని మడతబెట్టి' సాంగ్ అదుర్స్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 11:33 AM IST

Updated : Dec 29, 2023, 11:45 AM IST

Guntur Karam Kurchi Madatha Petti Song : సూపర్​స్టార్ మహేశ్​బాబు 'గుంటూరు కారం' సినిమా నుంచి మరో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది మూవీటీమ్.

Guntur Karam Kurchi Madatha Petti Song
Guntur Karam Kurchi Madatha Petti Song

Guntur Karam Kurchi Madatha Petti Song : సూపర్​స్టార్ మహేశ్ ​బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' సినిమా నుంచి మరో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది మూవీ టీమ్. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ట్రెండ్​ అయ్యిన 'కుర్చీని మడతబెట్టి' డైలాగ్​తో ఉన్న ఈ పాట అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మహేశ్​, శ్రీలీల స్టెప్పులు కేక అని చెబుతున్నారు. కాగా, ఈ ఫుల్​ సాంగ్​ డిసెంబర్ 30వ తేదీన విడుదల కానుంది.

ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా, తమన్ మ్యూజిక్​ అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలకు మంచి రెస్పాన్సే వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేశ్​, శ్రీలీలతోపాటు మీనాక్షీ చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ నటులు జగపతిబాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, సునీల్, రఘబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిన్ క్రియేషన్స్​పై రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరి 6వ తేదీన హైదరాబాద్​లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుందని సినీ వర్గాల్లో టాక్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా 2024 జనవరి 12వ తేదీన విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఫ్లైట్ ఎక్కేసిన మహేశ్​ ఫ్యామిలీ
మరోవైపు, మహేశ్​ ఫ్యామిలీతో క‌లిసి దుబాయ్ ప్లైట్ ఎక్కేశారు. శుక్రవారం ఉద‌య‌మే మ‌హేశ్​, న‌మ్ర‌త‌, గౌత‌మ్, సితార ఎయిర్ పోర్టులో బ్యాగుల‌తో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. దీంతో వెకేష‌న్ అని క‌న్ఫామ్ అయింది. అయితే ఈసారి దుబాయ్ వెకేష‌న్​తో పాటు ఓ చిన్న యాడ్ కూడా ప్లాన్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఒకేసారి రెండు ప‌నులు ముగించుకోవాల‌ని ఇలా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

న్యూ ఇయ‌ర్ వేడుక‌లు దుబాయ్​లో సెల‌బ్రేట్ చేసుకుని, యాడ్ షూడ్ కూడా ముగించుకుని తిరుగు ప్ర‌యాణం షురూ చేస్తారట మహేశ్. ఇక గుంటూరు కారం షూటింగ్ కూడా ముగిసిన‌ట్లు తెలుస్తోంది. గురువారంతోనే త‌న పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ అంతా పూర్త‌యిన‌ట్లు సమాచారం. అందుకే మ‌హేశ్​ ధీమాగా ప్లైట్ ఎక్కేశారట.

Last Updated : Dec 29, 2023, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.