ETV Bharat / entertainment

Gopichand 31 Movie : గోపీచంద్​ కొత్త మూవీ అనౌన్స్​మెంట్​.. 13 ఏళ్ల తర్వాత మళ్లీ అలా..

author img

By

Published : Jun 12, 2023, 2:50 PM IST

gopichand 31 movie
gopichand 31 movie

Gopichand 31 Movie : హీరో గోపీచంద్​ కొత్త సినిమా ప్రకటించారు. కన్నడ దర్శకుడితో ఆయన భీమా అనే సినిమా చేయనున్నారు. అందుకు సంబంధించిన టైటిల్​ పోస్టర్​ రిలీజైంది. దాన్ని మీరు చూసేయండి.

Gopichand New Movie : ఇటీవలే 'రామబాణం'తో డిజాస్టర్​ను అందుకున్నారు మెచో స్టార్ గోపీచంద్. అయితే ఆయన కమ్​బ్యాక్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా మెచోస్టార్​కు ఏ కాంబినేషన్ కూడా వర్కౌట్ అవ్వడం లేదు. రొటీన్ కథలతో వద్దని సినీ ప్రియులు చెబుతున్నప్పటికీ.. కమర్షియల్ జానర్​ను వదలకుండా హిట్టు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఈ సారి గేరు మార్చినట్టే కనిపిస్తోంది! కన్నడ దర్శకుడు ఏ హర్షతో కలిసి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Gopichand 31 Movie : నేడు(జూన్​ 12) తన పుట్టిన‌రోజు సంద‌ర్భంగా.. కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. టైటిల్​ పోస్టర్​ను రిలీజ్​ చేశారు. ఈ చిత్రానికి భీమా అనే టైటిల్​ను ఖరారు చేశారు. ఈ పోస్టర్​లో గోపీచంద్.. పొడవైన మీసకట్టుతో రగడ్​ లుక్​లో​ పవర్​ ఫుల్ పోలీస్​ ఆఫీసర్​గా కనిపిస్తున్నారు. సీరియస్​ లుక్​లో ఆయన ఎక్స్​ప్రెషన్స్​ కూడా ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎద్దు రంకెలు వేస్తూ దూసుకొస్తున్న‌ట్లుగా క‌నిపించ‌డం సినిమాపై మరింత ఆస‌క్తిని పెంచుతోంది.

Gopichand Police Character : అయితే గోపీచంద్ సిల్వర్​ స్క్రీన్​పై ఖాకీ చొక్కా తొడిగి చాలా కాలమైంది. చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత.. మళ్లీ పోలీస్ ఆఫీసర్​ పాత్ర‌లో న‌టిస్తున్నారాయన. గతంలో 2010లో పూరీ జగన్నాథ్​ 'గోలీమార్' సినిమాలో పోలీస్​గా కనిపించారు గోపీచంద్​. అందులో 'గంగారామ్'​ అనే పవర్​ఫుల్​ రోల్​లో కనిపించి ఆకట్టుకున్నారు. అంతకుముందు 'శౌర్యం', 'ఆంధ్రుడు'లోనూ పోలీస్​గా కనిపించారు. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్లు కాకపోయినా ఆడియెన్స్​ను ఆకట్టుకున్నాయి. అందుకే 'భీమా' చిత్రంపై ఆడియెన్స్​లో పాజిటివ్​ వైబ్రేషన్స్​ కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎమోష‌న్స్​తో కూడిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రాన్ని తెర‌కెక్కించబోతున్నట్లు తెలిసింది. గోపీచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ మూవీగా ఇది రూపొందనుంది. 'కేజీయఫ్​', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు.

Director Harsha Tollywood : ఇకపోతే ఈ 'భీమా' చిత్రంతో క‌న్న‌డ డైరెక్ట‌ర్ ఏ. హ‌ర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన నందమూరి బాలకృష్ణ- కన్నడ స్టార్ శివరాజ్​కుమార్​ కాంబో మల్టీస్టారర్​ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. మూడు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్​ కూడా కనిపించే అవకాశముంది.ఈయన చిత్రాలు డార్క్ టోన్​లో ఫాంటసీ ఎంటర్​టైనర్​గా ఉంటాయి. ఆయన రెండు భాగాలుగా రూపొందించిన 'భజరంగి' మంచి హిట్​ను అందుకుంది. అలాగే 'వేద' మూవీ ఇక్కడ ఆడలేదు కానీ.. కన్నడలో మంచి హిట్​ను అందుకుంది. మంచి కలెక్షన్లను కూడా వచ్చాయి. ఇక 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రాన్ని.. కన్నడ లో రీమేక్ చేసి హిట్లు కొట్టారు. పునీత్ రాజ్ కుమార్​తో 'అంజనీ పుత్ర' తెరకెక్కించి సూపర్ హిట్​ను అందుకున్నారు. అందుకే ఇప్పుడు ప్రకటించిన 'భీమా'పై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో గోపీచంద్​ ఎలాంటి హిట్​ను అందుకుంటారో చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.