ETV Bharat / entertainment

కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న తొలి సింగర్​ - కానీ 13 ఏళ్లకే!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 10:44 AM IST

Updated : Nov 26, 2023, 3:50 PM IST

First Singer To Charge 1 Crore Remuneration
First Singer To Charge 1 Crore Remuneration

First Singer To Charge 1 Crore Remuneration : సాధారణంగా గాయకులు ఒక పాటకు ఎంత రెమ్యూనరేషన్​ తీసుకుంటారు..? ఆ సింగర్ ఆదరణ, క్రేజ్​ని బట్టి రూ.10 నుంచి రూ. 20 లక్షల వరకు అందుకోవచ్చు. కానీ ఒక గాయని మాత్రం ఏకంగా రూ.కోటి రెమ్యూనరేషన్ అందుకున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే ?

First Singer To Charge 1 Crore Remuneration : సినీ పరిశ్రమలో గాయకులకు మంచి స్థానమే ఉంది. ముఖ్యంగా దివంగత ఎస్పీ బాలు, చిత్ర, శ్రేయా ఘోషల్ లాంటి వాళ్లకు కోట్లల్లో అభిమానులున్నారు. ఇలాంటి వారికి డిమాండ్ కూడా ఎక్కవే ఉంటుంది. ఎంత డిమాండ్ ఉన్నా.. ఒక పాటకు మహా అయితే రూ.20 నుంచి 30 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునుంటారు. కానీ ఓ గాయని మాత్రం ఒక పాటకు ఏకంగా రూ. కోటి తీసుకున్నారు. ఇంత‌కీ ఆమె ఎవ‌రంటే..

ఉత్త‌ర్​ప్ర‌దేశ్​లోని ఆజంగ‌ఢ్​కి చెందిన గౌహ‌ర్ జాన్‌.. అస‌లు పేరు ఏంజెలీనా యోవార్డ్. వీరి పూర్వీకులు ఆర్మేనియ‌న్ మూలానికి చెందినవారు. గౌహర్ తాత బ్రిటిష్ కాగా, అమ్మమ్మ హిందూ. ఈమె ఇండియాలోనే జ‌న్మించారు. తల్లికి సంగీతంతో పాటు నృత్యంలోనూ నైపుణ్యం ఉన్నందు వల్ల.. గౌహ‌ర్​కి ఆమె నుంచే ఆ రెండు క‌ళ‌లు వార‌స‌త్వంగా వ‌చ్చాయి. అయితే ఆమెకు ఆరేళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోయారు.

అయితే విడాకుల తర్వాత గౌహర్​ తల్లి.. ఖుర్షీద్ అనే వ్యక్తితో కలిసి బనారస్ వచ్చారు. ఆ తర్వాత వాళ్ల కుటుంబం ఇస్లాం మతాన్ని స్వీకరించింది. అలా ఏంజెలీనా కాస్త.. గౌహర్ జాన్​గా మారారు. కొంత కాలానికి గౌహర్​ తల్లి మల్కా జాన్.. బనారస్​లో ప్రముఖ గాయ‌నిగా క‌థ‌క్ డ్యాన్సర్​గా మంచి గుర్తింపు పొందారు. అయితే కొంత కాలం తర్వాత కూతురుతో కోల్​కతాకు వెళ్లిన మల్కాజాన్​.. అక్కడ నవాబ్ వాజిద్ అలీ షా ఆస్థానంలో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు.

  • GAUHAR JAAN : Born on 26th June 1873 in Azamgarh, as Eileen Angelina Yeoward, an Armenian Christian

    In 1902, Gauhar Jaan became one of the first artistes to be recorded in India. She recorded 600+ songs 10+ languages

    She would end her performances with “My name is Gauhar Jaan” pic.twitter.com/ZaRWOjGL2t

    — Film History Pics (@FilmHistoryPic) June 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇక గౌహర్​ కెరీర్​ విషయానికి వస్తే.. ఫోనోగ్రాఫ్ రికార్డ్ (గ్రామోఫోన్​ సీడీ)లో పాటలు రికార్డ్ చేసిన మొదటి భారతీయ గాయకురాలిగా గౌహర్ రికార్డుకెక్కారు. భారత్​లోని ప్రముఖ గ్రామోఫోన్ కంపెనీ ఆమె పాటలను విడుదల చేసింది. అయితే ఆమె ప్రతి పాటకు చివరిలో 'మై నేమ్ ఈజ్ గౌహర్ జాన్' అనే ఇంగ్లీష్​ సిగ్నేచర్​ చెప్పేవారు. ఇది అప్పట్లో బాగా ఫేమస్​ అయ్యింది.

కోటిలో పారితోషకం.. ప్రైవేట్​ ట్రైన్​..
Gauhar Jaan Remuneration : సినీ వర్గాల సమచారం ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధర రూ. 20 ఉన్న సమయంలోనే, గౌహర్​.. ఒక పాట కోసం రూ. 3,000 పారితోషకం అందుకునేవారుట. ఇప్పటి లెక్కల ప్రకారం ఆ మెత్తం.. దాదాపు కోటి రూపాయలు ఉండొచ్చని అంచనా.

మరోవైపు కెరీర్ పీక్స్​లో ఉన్న‌ సమయంలో గౌహర్​ రికార్డింగ్​కు వెళ్లడానికి ఆమెకంటూ ఓ ప్రైవేట్​ రైలు సౌకర్యం ఉండేదట. అంతే కాకుండా వివిధ రకాల ఆభరణాలను సైతం ధరించేదట. ఇలా సకల సౌకర్యాలను అనుభవించిన ఆమె.. భారత్​లోనే అత్యంత సంపన్నురాలైన సింగర్​గా ఎదిగారు. 1887లో 'దర్భంగా రాజ్' సంస్థానంలో గౌహర్​ తన మొదటి ప్రదర్శనను ఇచ్చారు. ఆ తర్వాత ఆమె ఆస్థాన సంగీత విద్వాంసురాలుగా నియమితురాలయ్యారు. 1896 నుంచి కోలకతాలో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించిన ఆమె.. అన‌తి కాలంలోనే ఫేమ‌స్ అయ్యారు.

  • Frederick William Gaisberg & George Dillnutt came to India in 1902, recorded 216 seven inch wax matrices and 336 ten inch wax matrices in Calcutta (gramophones). Gauhar Jaan recorded raag Jogiya on November 02, 1902 and became the first singer to be recorded in India. pic.twitter.com/tl6nQ4e9BI

    — Heritage Times (@HeritageTimesIN) August 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అయితే గౌహర్​ బాల్యం, వృద్ధాప్యం దారుణంగా గ‌డిచింది. త‌న బాల్యాన్ని వ్య‌భిచార గృహంలో గ‌డిపిన ఆమె.. 13 ఏళ్ల వ‌య‌సులో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారు. వ్య‌క్తిగ‌త జీవితంలో కూడా అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌డంతో పాటు తన బంధువులు సైతం ఆమెను మోస‌ం చేశారు. అయితే తన కెరీర్​లో ఉన్నత స్థానలకు ఎదిగిన గౌహర్​.. 1930 జనవరి 17న దీన స్థితిలో మ‌రణించ‌డం విషాద‌క‌రం. గౌహ‌ర్ బంధువులు ఆమెను మోసం చేసి, త‌న ఆస్తి ఖర్చు చేశారని, భోజనం కూడా పెట్టేవారు కార‌ని చెబుతారు.

'గాన కోకిల'కు అరుదైన గౌరవం - గాయని పి సుశీలకు డాక్టరేట్ ప్రదానం

విద్యా వాక్స్ ఆస్తి అన్ని రూ.కోట్లా? సంపాదన ఎంతో తెలిస్తే షాక్!

Last Updated :Nov 26, 2023, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.