ETV Bharat / entertainment

కూరలో సైనైడ్ కలిపి 6 హత్యలు- నెట్​ఫ్లిక్స్​లో రికార్డు సృష్టిస్తున్న రియల్ క్రైమ్ స్టోరీ

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 9:49 AM IST

Updated : Jan 5, 2024, 10:37 AM IST

Curry And Cyanide Documentary : 'కర్రీ అండ్‌ సైనైడ్‌' డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ రికార్డు సృష్టిస్తోంది. నెట్​ఫ్లిక్స్​ గ్లోబల్ టాప్‌-10 కంటెంట్‌లలో ఒకటిగా నిలిచింది. ఆ వివరాలు

Curry And Cyanide Documentary
Curry And Cyanide Documentary

Curry And Cyanide Documentary : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాలీ జోషెఫ్ కేసు ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ నెట్​ఫ్లిక్స్​లో రికార్డులు సృష్టింస్తోంది. ఇటీవల విడుదలైన 'కర్రీ అండ్‌ సైనైడ్‌ : ది జాలీ జోసెఫ్‌ కేస్‌' అనే డాక్యుమెంటరీ భాషతో సంబంధం లేకుండా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 30కు పైగా దేశాల ప్రేక్షకుల ఆదరణ పొందింది. క్రిస్టో టామీ దీనికి దర్శకత్వం వహించారు. డిసెంబర్‌ 22వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో రెండు వారాల పాటు గ్లోబల్​ టాప్‌-10 స్ట్రీమింగ్‌ కంటెంట్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ మేరకు నెట్​ఫ్లిక్స్​ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. గంటన్నర నిడివి గల 'కర్రీ అండ్‌ సైనైడ్‌' తెలుగు భాషలోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది.

  • Acclaimed in over 30 countries globally, the spine chilling true crime documentary Curry & Cyanide: The Jolly Joseph Case is a must watch.
    Watch now in Malayalam, Tamil, Telugu, Kannada, Hindi and English only on Netflix! pic.twitter.com/tWTbtithlF

    — Netflix India South (@Netflix_INSouth) January 4, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Jolly Joseph Case Details : కేరళలోని కూడతైకి చెందిన జాలీ అలియాస్‌ జాలీ జోసెఫ్‌కు విలాసవంతమైన జీవితం గడపాలని ఆశ. అందుకు అడ్డుగా ఉన్న అత్తను, ఆస్తి కోసం మామను, అనుమానించాడని భర్తను, బాబాయ్‌ను ఆహారంలో సైనైడ్‌ పెట్టి చంపేసింది. తాను రెండో పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉందని తన ప్రియుడి భార్య, ఆమె కూతురుకి సైనైడ్ ఇచ్చి దారుణంగా హతమార్చింది. అలా ఎవరికీ అనుమానం రాకుండా 14 ఏళ్లలో ఆరుగురిని హత్య చేసింది. 2002లో తన అత్తను మొదట హత్య చేసిన జాలీ, 2016లో చివరి హత్య చేసింది. ప్రతి హత్యకు మధ్య కొంతకాలం గ్యాప్​ తీసుకుంది.

Jolly Joseph Series : అయితే జాలీపై అనుమానం ఉన్న ఆమె ఆడపడుచు దాదాపు ఆరేళ్ల తర్వాత ధైర్యం చేసి 2019 జూన్​లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తల్లిదండ్రులు, సోదరుడి మృతదేహాలకు మళ్లీ శవపరీక్ష చేయాలని కోరింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చెపట్టారు. మృతదేహాలను వెలికి తీసి రీ-పోస్టుమార్టం నిర్వహించారు. వారి అవశేషాల్లో సైనైడ్​ ఉందని తేలింది. దీంతో జాలీ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. 2019 అక్టోబర్ 5న జాలీని పోలీసులు అరెస్టు చేశారు.

మందులో, మందుల్లో 'సైనైడ్' కలిపి 'జాలీ' హత్యలు!

వరుస హత్యల నిందితురాలు జాలీ ఆత్మహత్యాయత్నం

Last Updated : Jan 5, 2024, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.