పవర్​ఫుల్​గా 'గాడ్​ఫాదర్​' ట్రైలర్​​.. చిరు యాక్షన్​ అదరగొట్టేశారుగా

author img

By

Published : Sep 28, 2022, 8:06 PM IST

Updated : Sep 28, 2022, 8:40 PM IST

godfather trailer

మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సల్మాన్​ ఖాన్​ నటిస్తున్న గాడ్​ఫాదర్ సినిమా ట్రైలర్​ విడుదలైంది. యాక్షన్​ సన్నివేశాలతో ఇది ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

మెగాఫ్యాన్స్​కు మరో సర్​ప్రైజ్​ వచ్చేసింది. 'గాడ్​ఫాదర్​' సినిమా విడుదల తేదీ దగ్గర పడటం వల్ల ప్రమోషన్స్​లో జోరు పెంచిన మూవీటీమ్​.. తాజాగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్​ను విడుదల చేసింది. ఇది అభిమానుల అంచనాలకు తగ్గట్టు పూనకాలు తెప్పించేలా ఉంది. చిరంజీవి యాక్షన్‌, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, తమన్‌ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చిరు కొత్త లుక్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కీలక పాత్రలో నటించిన సల్మాన్ యాక్షన్ కూడా అదిరింది. కాగా, ఇప్పటికే విడుదలైన పోస్టర్స్​, టీజర్​, సాంగ్స్​ మూవీపై భారీ అంచనాలను పెంచాయి.

చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించిన చిత్రమిది. మలయాళ హిట్‌ సినిమా 'లూసిఫర్‌'కు రీమేక్‌గా రూపొందింది. ఈ పొలిటికల్‌ యాక్షన్‌ మూవీలో సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. రామ్‌చరణ్‌, ఆర్‌.బి. చౌదరి, ఎన్‌.వి. ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 5న తెలుగు, హిందీ భాషల్లో విడుదలకానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: చిరుత 15 ఇయర్స్​.. చిరంజీవి ఎమోషనల్​.. 'నచ్చిమి' పాత్ర ఎలా వచ్చిందంటే

Last Updated :Sep 28, 2022, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.