చిరుత 15 ఇయర్స్​.. చిరంజీవి ఎమోషనల్​.. 'నచ్చిమి' పాత్ర ఎలా వచ్చిందంటే

author img

By

Published : Sep 28, 2022, 6:40 PM IST

Updated : Sep 28, 2022, 7:00 PM IST

chiranjeevi emotional 15 years

రామ్​చరణ్​ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత నేటితో విడుదలై 15ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మెగాస్టార్​ చిరంజీవి.. చరణ్​ సినీ జర్నీని ప్రస్తావిస్తూ ఓ ఎమోషనల్​ ట్వీట్ చేశారు. దాంతో పాటు ఈ చిత్ర విశేషాలను ఓ సారి నెమరువేసుకుందాం..

మెగా పవర్ స్టార్ రామ్​చరణ్​ హీరోగా పరిచయమైన చిత్రం 'చిరుత'. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ నిర్మించారు. 2007 సెప్టెంబర్ 28న ఈ మూవీ రిలీజై హిట్​టాక్​ను తెచ్చుకుంది. పవర్‌ఫుల్‌ సంభాషణలు, ఉర్రూతలూగించే డ్యాన్స్‌తో తొలి పరిచయంలోనే విశేషంగా ఆకట్టుకున్నారు చరణ్‌. కాగా ఈ చిత్రం విడుదలై నేటితో 15ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో సోషల్ మీడియాలో మెగాఫ్యాన్స్​ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత 'మగధీర', 'రచ్చ', 'నాయక్‌', 'ఎవడు', 'గోవిందుడు అందరివాడేలే', 'ధ్రువ', 'రంగస్థలం', 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రాలతో చరణ్​ మెప్పించారు.

చిరంజీవి ఎమోషనల్​.. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా తన కొడుకు రామ్‌ చరణ్‌పై ప్రేమను చాటుకున్నారు. నటుడిగా కెరీర్ ప్రారంభించి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర‍్భంగా ఎమోషనల్ అయ్యారు. చిరుతతో మొదలై మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వరకు చరణ్ ప్రస్థానాన్ని మెగాస్టార్ కొనియాడారు. ప్రస్తుతం దర్శకుడు శంకర్‌తో సినిమా చేసే స్థాయికి ఎదిగాడని హర్షం వ్యక్తం చేశారు.

'తన వర్క్, డెడికేషన్ అన్నీ చూసి ఎంతో గర్విస్తున్నా. భవిష్యత్​లో రామ్ చరణ్ మరింత ఉన్నత శిఖరాలు అందుకోవాలి. నిన్ను చూసి గర్విస్తున్నా. నువ్వు సాధించాల్సినవి ఇంకా ఉన్నాయి. వాటి కోసం ముందుకెళ్లు.' అంటూ ట్వీట్ చేశారు.

'నచ్చిమి' పాత్ర ఎలా వచ్చిందంటే.. ఇకపోతే పూరి చేసే ప్రతి చిత్రంలోనూ అలీకి ఓ పాత్ర తప్పకుండా ఉంటుంది. అయితే, 'చిరుత' కథ అనుకున్నప్పుడు అసలు ఇందులో అలీకి ఎలాంటి పాత్రా రాసుకోలేదట పూరి. కానీ, స్క్రిప్ట్‌ పనులపై బ్యాంకాక్‌ వెళ్తున్న సమయంలో ఎదురైన అనుభవాల కారణంగా అలీ కోసం పాత్రను సిద్ధం చేసినట్లు పూరి తెలిపారు.

''చిరుత' కథ ఓకే అయిన తర్వాత స్క్రిప్ట్‌ రాసుకోవడానికి బ్యాంకాక్‌ బయలుదేరాను. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లగానే సెక్యురిటీ చెక్‌ వద్ద 'సర్‌ కొత్త సినిమా కోసం వెళ్తున్నారా.. అలీ ఏ పాత్రలో నటిస్తున్నారు?' అని భద్రతా సిబ్బందిలో ఒకతను అడిగాడు. ఆ తర్వాత బోర్డింగ్‌ పాస్‌ తీసుకుంటున్న సమయంలోనూ మరో వ్యక్తి 'సర్‌.. అలీ క్యారెక్టర్‌ ఏంటి' అని అడిగాడు. దీంతో ఆలోచనలో పడ్డా. వెంటనే నిర్మాత అశ్వనీదత్‌గారికి ఫోన్‌ చేసి 'సర్‌.. వెంటనే అలీ డేట్స్‌ తీసుకోండి. ఈ సినిమాలో ఆయనకు క్యారెక్టర్‌ ఇవ్వకపోతే జనాలు ఊరుకునేలా లేరు' అని చెప్పడం వల్ల అలీ డేట్స్‌ బుక్‌ చేశారు. బ్యాంకాక్‌ వెళ్లిన తర్వాత అక్కడి వాళ్లను చూసి 'నచ్చిమి' పాత్ర రాసుకున్నా. అది ఎంత సూపర్‌హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే'' అని పూరి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

'చిరుత'లో నచ్చిమిగా అలీ పాత్ర, వేషధారణ, అన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఆయన చేసిన క్యారెక్టర్‌లలో భిన్నమైన పాత్రగా నచ్చిమి గుర్తింపు తెచ్చింది. ఇప్పటికీ బుల్లితెరపై 'నచ్చిమి'గా అలీ కనపడితే నవ్వులే నవ్వులు.

చిరుత 15ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమా కలెక్షన్స్(సమాచారం)​ ఓ లుక్కేద్దాం..

  • నైజాం 7.02 cr
  • సీడెడ్ 5.34 cr
  • ఉత్తరాంధ్ర 2.40 cr
  • ఈస్ట్ 1.64 cr
  • వెస్ట్ 1.58 cr
  • గుంటూరు 2.06 cr
  • కృష్ణా 1.62 cr
  • నెల్లూరు 1.05 cr
  • ఏపీ + తెలంగాణ (టోటల్) 22.71 cr
  • రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 2.48 cr
  • వరల్డ్ వైడ్ (టోటల్) 25.19 cr

'చిరుత' చిత్రం రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్​తో బరిలోకి దిగింది. అప్పుడు డెబ్యూ హీరోలకు ఇంత బిజినెస్ జరగడం ఇదే మొదటిసారి. అయితే ఈ మూవీ ఏకంగా రూ.25.19 కోట్ల షేర్​ను అందుకుంది. ఓవరాల్​గా బయ్యర్స్​కు ఈ మూవీ రూ.7.19 కోట్ల లాభాలను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇదీ చూడండి: త్రిషకు ఆ బడా దర్శకుడు వార్నింగ్​.. ఎందుకంటే?

Last Updated :Sep 28, 2022, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.