ETV Bharat / entertainment

ప్రభాస్​తో స్క్రీన్​ షేర్​ చేసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా: అమితాబ్​

author img

By

Published : Jul 7, 2023, 6:55 PM IST

Updated : Jul 7, 2023, 7:10 PM IST

Project K Amitabh Bachan Tweets
Project K Amitabh Bachan Tweets

Amitabh Bachchan Prabhas : హీరో​ ప్రభాస్​ నటిస్తున్న అప్​కమింగ్​ మూవీ ప్రాజెక్ట్​-కె. ఈ సినిమా అందుకున్న అరుదైన గౌరవంపై సంతోషం వ్యక్తం చేశారు బాలీవుడ్​ బిగ్​ బి అమితాబ్​ బచ్చన్. ప్రభాస్​తో స్క్రీన్​ షేర్​ చేసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.

Project k Amitabh : ఇంకా షూటింగ్​ దశలోనే ఉన్న 'ప్రాజెక్ట్​-కె' సినిమా.. ఏ భారతీయ చిత్రం అందుకోని ఓ అరుదైన గౌరవాన్ని తాజాగా దక్కించుకుంది. అదే అమెరికాలోని 'శాన్ డియాగో'లో జులై 20 నుంచి 23 వరకు జరగబోయే ప్రముఖ 'కామిక్​ కాన్​ ఈవెంట్​'కు ఎంపిక కావడం. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్​ ప్రకటిస్తూ ఓ స్పెషల్ పోస్టర్​ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీనిపై ఆనందం వ్యక్తం చేశారు హీరో ప్రభాస్​, బిగ్​ బీ అమితాబ్​ బచ్చన్​. అయితే 'ప్రాజెక్ట్​-కె' సినిమా గురించి బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ చేసిన ఓ ట్వీట్​ ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.​

"'శాన్​ డియాగో కామిన్​ కాన్​ ఈవెంట్​'లో పాల్గొనే అవకాశాన్ని ప్రాజెక్ట్​-కె దక్కించుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ సినిమాలో నేను నటిస్తున్నప్పటికీ ఇన్ని రోజులు ఈ సినిమా ఇంత గొప్పదని, పెద్దదని.. అమెరికాలో జరిగే అంతటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్​కు ఎంపిక అవుతుందని అస్సలు అనుకోలేదు. సినిమాలో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఫీల్​ అవుతున్నా. ఈ అనుభవాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను."

- అమితాబ్​ బచ్చన్​, బాలీవుడ్​ స్టార్​ హీరో

ఆయనతో స్క్రీన్​ షేరింగ్​ నాకు గౌరవం..
ప్రాజెక్ట్​-కెను నిర్మిస్తున్న ఇటువంటి గొప్ప బ్యానర్​లో నేను భాగమైనందుకు.. అలాగే హీరో ప్రభాస్​తో స్క్రీన్​ షేర్​ చేసుకోవటం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు అమితాబ్​. సెట్స్​లో ప్రభాస్​ నా పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయతలు తనను ఎమోషనల్​గా ఎంతగానో టచ్​ చేశాయని తెలిపారు. ఈ సందర్భంగా మూవీ టీమ్​ మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు​ తెలిపారు. గొప్ప ప్రాజెక్ట్​లో తనను భాగం చేసిన నాగ్​ అశ్విన్​కు స్పెషల్​ థ్యాంక్స్ చెప్పారు.

  • T 4698 - I am honoured and have had the great privilege of being a part of this great enterprise in Telugu Cinema , ‘Project K’ and to have had the huge honour of being in the same frame of the Idol , Prabhas ..

    Thank you all .. and thank you Nagi Sir, for thinking of me ..… https://t.co/7c5vbQ0i5I

    — Amitabh Bachchan (@SrBachchan) July 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • T 4697 - ... a proud moment for me .. I never realised how important and BIG this is ..
    Now I know .. my wishes to Vyjayanthi Movies , Nag Sir and the entire unit for the affection they have given me , and to make me a part of this incredible experience 🙏 https://t.co/7c5vbQ0i5I

    — Amitabh Bachchan (@SrBachchan) July 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అప్పుడే టైటిల్​, ట్రైలర్​..
మరోవైపు ఇంతటి గొప్ప ప్రాజెక్ట్​కు సంబంధించి టైటిల్​, ట్రైలర్​ లాంఛ్​కు ఇంతకు మించిన గొప్ప వేదిక మరొకటి దొరకదంటూ వ్యాఖ్యానించారు డైరెక్టర్​ నాగ్​ అశ్విన్. ఇదే ఈవెంట్​లో సినిమా టైటిల్​తో పాటు ట్రైలర్​ను కూడా లాంఛ్​ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్​లో పాల్గొనేందుకు దర్శకుడు నాగ్ అశ్విన్​తో పాటు నిర్మాత, హీరో ప్రభాస్​, హీరోయిన్​ దీపికా పదుకొణె, కోలీవుడ్​ లెజెండ్​ కమల్​ హాసన్​ అమెరికాకు వెళ్లనున్నారట.

తొలి ఇండియన్​ సినిమాగా..
ఇక అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ ఈవెంట్​కు హాజరుకానున్న తొలి భారతీయ సినిమాగా 'ప్రాజెక్ట్‌-కె' రికార్డు సాధించింది. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారట మేకర్స్.

Last Updated :Jul 7, 2023, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.