ETV Bharat / entertainment

'కొన్ని సీన్స్​లో యాక్ట్​ చేయడం ఇబ్బందిగా అనిపించేది - షూటింగ్ స్పాట్​లో అలా చేసేవాడిని'

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 9:00 PM IST

Bobby Deol Animal Movie : బాలీవుడ్ స్టార్ హీరో బాబీ దేవోల్ తాజాగా యానిమల్​లో తన క్యారెక్టర్​ గురించి వివరించారు. ఇందులో భాగంగా ఈ సినిమాలో తనను ఇబ్బందిపెట్టిన కొన్ని ఘటనల గురించి వివరించారు. ఆ విశేషాలు మీ కోసం

Bobby Deol Animal Movie
Bobby Deol Animal Movie

Bobby Deol Animal Movie : 'యానిమల్'​ సెకెండాఫ్​ను ఆసక్తి రేకెత్తించేలా చేయడంలో బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ పాత్ర కీలకం. ఇందులో ఆయన అబ్రార్​ అనే మూగ విలన్​గా నటించి ఆడియెన్స్​ను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆయన పాత్ర నిడివి కొంతసేపే అయినప్పటికీ తనదైన శైలిలో యాక్ట్​ చేసి అందరి ప్రశంసలు పొందారు. అయితే తాజాగా ఈయన తన క్యారెక్టర్​ గురించి పలు విషయాలు పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాలో తనను ఇబ్బందిపెట్టిన కొన్ని ఘటనల గురించి వివరించారు.

"యానిమల్‌ షూటింగ్ మొదలయ్యాక నాకు కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్న సమయంలో మొదట్లో నాకు ఇబ్బందిగా అనిపించేది. ఎందుకిలా చిరాగ్గా అనిపిస్తుందంటూ నన్ను నేను తర్వాత ప్రశ్నించుకున్నాను. అయితే నేను కేవలం ఓ పాత్రలో నటిస్తున్నాను. సినిమాలో నేను ఎవరితో అయితే దురుసుగా ప్రవర్తిస్తున్నానో వాళ్లతో కలిసి షూట్‌ అయ్యాక నేను కలిసి భోజనం చేస్తాను. అంతా సవ్యంగానే ఉంటుంది. ఇది కేవలం ఓ పాత్ర మాత్రమే అని గ్రహించాను. ఇందులో నా పాత్రను నేను విలన్‌గా ఎప్పుడూ భావించలేదు. కుటుంబాన్ని అతిగా ప్రేమించే ఓ వ్యక్తిగానే భావించాను. తాతయ్య మరణానికి ప్రతీకారం తీర్చుకునే మనవడి పాత్రకు నేను న్యాయం చేయాలని అనుకుని నటించాను" అని తెలిపారు.

ఇక తాజాగా ఆయన 'కంగువా'లో తన రోల్​ గురించి కూడా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందులో తన కంఫర్ట్ జోన్ దాటి మరీ నటించానంటూ ఆయన తెలిపారు. అంతే కాకుండా ఇందులో ఆయన పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుందని అన్నారు. ఇది విన్న ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. యానిమల్​లో విలన్​ పాత్రతో మెప్పించిన బాబీ ఈ సినిమలోనూ ఓ సూపర్ రోల్​తో ప్రేక్షకుల ముందుకొస్తారని ఆశిస్తున్నారు.

మరోవైపు తన కుమారులు ఇండస్ట్రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు బాబీ దేవోల్‌ చెప్పారు. "మా అబ్బాయిలకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నేను వాళ్లకు కూడా కొన్ని సలహాలిచ్చాను. నటనలో రాణించాలంటే ముందు భాషపై పట్టు ఉండాలని వారికి చెప్పాను. హిందీ నేర్చుకోమంటూ సలహా ఇచ్చాను. ఇంట్లో కూడా ఇంగ్లీష్​లో కాకుండా హిందీలో మాట్లాడాలని చెప్పాను" అని తెలిపారు.

ఆ ఒక్క ఫొటోతో బాలీవుడ్​లో సందీప్​ రెడ్డి మేజిక్.. సీక్రెట్ చెప్పేసిన బాబీ!

పవన్​ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' డైలాగ్​ లీక్​- 'యానిమల్' విలన్ అంత పని చేశాడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.