ETV Bharat / entertainment

Bhagavanth Kesari Vs LeO Vs Tiger Nageswarao Collections : దసరా రోజు దుమ్ములేపిన కలెక్షన్స్​.. ఎంతొచ్చాయంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 1:46 PM IST

Updated : Oct 24, 2023, 2:51 PM IST

Bhagavanth Kesari VS LeO VS Tiger Nageswarao Collections : దసరా కానుకగా బాక్సాఫీస్​ ముందు అగ్ర తారల సినిమాలు సందడి చేస్తున్నాయి. 'భగవంత్​ కేసరి', 'లియో', 'టైగర్​ నాగేశ్వర రావు' చిత్రాలు బాక్సాఫీస్​ వద్ద మంచి టాక్ అందుకుని దూసుకెళ్తున్నాయి. ఆయా చిత్రాల కలెక్షన్స్​ వివరాలను చూద్దాం..

Bhagavanth Kesari Movie Collections
Bhagavanth Kesari Movie Collections

Bhagavanth Kesari Movie Collections : నందమూరి నటసింహాం బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్​లో తెరకెక్కిన 'భగవంత్ కేసరి'. అటు టాక్ పరంగానే కాకుండా ఇటు కలెక్షన్ల పరంగానూ ఓ రేంజ్​లో దూసుకెళ్తోంది. తొలి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకున్న ఈ చిత్రం ఆ తర్వాత కూడా అదే రేంజ్​లో వసూళ్లను అందుకుంటూ రికార్డులను బ్రేక్​ చేస్తోంది. దసరా పండుగతో పాటు వీకెండ్ రావడం వల్ల మూవీ లవర్స్​ థియేటర్లకు బారులు తీశారు. దీంతో కలెక్షన్స్​ కూడా అమాంతం పెరిగిపోయింది.

ఈ క్రమంలో ఐదో రోజు ఏపీ/ తెలంగాణలో రూ.8.6 కోట్లు, తమిళనాడులో రూ. 0.09 కోట్లు, కర్ణాటకలో రూ. 0.1 కోట్లు, కేరళలో రూ. 0.01 కోట్లు ఇలా ఇండియా వైడ్​గా రూ. 8.85 కోట్ల గ్రాస్​ను, రూ. 7.65కోట్ల నెట్​ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఇండియా వైడ్​గా.. ఐదు రోజుల్లో కలిపి రూ.56.55 కోట్లు గ్రాస్, ​ రూ.48.35కోట్ల నెట్​ - ప్రపంచవ్యాప్తంగా రూ.68.55 నెట్ వసూలు చేసిందట.

లియో వసూళ్ల వివరాలిలా..
Leo Movie Day 5 Collections : దళపతి విజయ్ లోకేశ్​ కనగరాజ్​ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'లియో'. తాజాగా విడుదలైన ఈ సినిమా టాక్​ పరంగా మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ.. కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్​లో దూసుకెళ్తోంది. నాలుగు రోజుల్లోనే 400 కోట్ల క్లబ్​లోకి వెళ్లిన ఈ సినిమా.. ఐదవ రోజు సుమారు ఇండియాలో రూ. 35 కోట్ల (నెట్​​) వసూళ్లను అందుకున్నట్లు సమాచారం. తమిళనాడులో రూ. 26 కోట్లు, కేరళలో రూ. 7 కోట్లు, కర్ణాటకలో రూ.3 కోట్లు, ఏపీ, తెలంగాణలో రూ. 2.50 కోట్లు, మిగిలిన ప్రాంతాల్లో సూమారు రూ. 2.50 కోట్లను వసూలు చేసిందని సమాచారం.

టైగర్​ నాగేశ్వరరావు లెక్కలు ఇవే..
Tiger Nageswara Rao Movie Collections : మాస్​ మహారాజ రవితేజ లీడ్​ రోల్​లో తెరకెక్కిన తాజాా మూవీ 'టైగర్​ నాగేశ్వరరావు'. అక్టోబర్​ 20న విడుదలైన ఈ చిత్రం కూడా మంచి టాక్​ అందుకుని బాక్సాఫీస్​ వద్ద వసూళ్లను సాధిస్తోంది. ట్రేడ్​ వర్గాల ప్రకారం ఏపీ/ తెలంగాణ రూ. 0.35 కోట్లు, తమిళనాడు రూ. 0.15 కోట్లు, మిగిలిన రాష్ట్రాలు రూ. 0.05 కోట్లు వసూళ్లు వచ్చాయి. మొత్తంగా నాలుగు రోజుల్లో ఇండియాలో దాదాపు రూ. 22.65 గ్రాస్, అలాగే రూ. 19.34 నెట్​ కలెక్షన్లను అందుకోగా.. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 25.40 కోట్ల నెట్​వసూళ్లను అందుకుంది.

వీకెండ్​తో పాటు దసరా పండగ వల్ల ఈ సినిమా కలెక్షన్లలో మార్పులు వచ్చాయి. గత నాలుగు రోజులతో పోలిస్తే సోమవారం మంచి కలెక్షన్లను అందుకున్నాయి. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. రానున్న రోజుల్లో ఇదే కలెక్షన్స్​తో దూసుకెళ్లాలని ఆశిస్తున్నారు.

Bhagavanth Kesari Movie Screening : 'భగవంత్​ కేసరి'కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.. ఒక్కసారిగా పెరిగిన స్క్రీన్స్!

'లియో' కలెక్షన్ల జోరు.. నాలుగు రోజుల్లోనే రూ. 400 కోట్లు క్రాస్.. 'టైగర్ నాగేశ్వరరావు' కలెక్షన్స్ ఎంతంటే?

Last Updated : Oct 24, 2023, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.