ETV Bharat / entertainment

బాలయ్య 'వీర సింహారెడ్డి' రోర్​.. 18 రోజుల్లో బాక్సాఫీస్​ కలెక్షన్​ ఎంతంటే?

author img

By

Published : Jan 30, 2023, 1:33 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది. ఇప్పటివరకు ఎంత సాధించిందంటే?

Balakrishna Veerasimha reddy 18days collections
బాలయ్య 'వీరసింహారెడ్డి' రోర్​.. 18 రోజుల్లో బాక్సాఫీస్​ కలెక్షన్​ ఎంతంటే?

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' కూడా వాల్తేరు వీరయ్యకు పోటీగా ఇంకా బాక్సాఫీస్​ ముందు జోరు కొనసాగిస్తోంది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు నుంచే మంచి వసూళ్లను అందుకుంటోంది. విడుదలై18 రోజులైనా ఇంకా బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలయ్య అఖండ చిత్రం మెుదటి వారం.. రూ.53.49 కోట్ల షేర్(రూ.87.9 కోట్ల గ్రాస్) సాధించగా.. వీరసింహారెడ్డి మెుదటి వారంలో రూ.68.51 కోట్ల షేర్(రూ.114.95 కోగ్లా గ్రాస్​) వసూళ్లు సాధించినట్టుగా ట్రేడ్ వర్గాల సమాచరం.

18 రోజుల ఏరియా వారీగా.. నైజాం 17.10కోట్లు, సీడెడ్ రూ. 16.40 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.8.52 కోట్లు, తూర్పు గోదావరి రూ.6.55 కోట్లు, పశ్చిమ గోదావరి రూ. 4.88 కోట్లు, గుంటూరు రూ.7.40 కోట్లు, కృష్ణ రూ. 4.70 కోట్లు, నెల్లూరు రూ. 2.97 కోట్లు వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో రూ. 68.52 కోట్లు నెట్​.. (రూ.111.20 కోట్లు గ్రాస్)గా వచ్చినట్లు తెలిసింది. కర్ణాటక ప్లస్​ రెస్ట్​ ఆఫ్ ఇండియా రూ.4.81 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.76 కోట్లు.. కలిపి ప్రపంచ వ్యాప్తంగా 18 రోజుల్లో.. రూ. 79.09 కోట్లు షేర్ (రూ. 132.30 కోట్లు గ్రాస్) వసూళ్లు వచ్చాయట.

ఇక వీరసింహా రెడ్డి విషయానికొస్తే.. మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య అటు యాక్షన్​తో పాట ఇటు సెంటిమెంట్​ను బ్యాలెన్స్​ చేసి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు.​ ఈ సినిమాలో నటించిన ఇతర తారలు దునియా విజయ్​, వరలక్ష్మీ శరత్​కుమార్​, శ్రుతిహాసన్​, హనీ రోజ్​ సైతం తమదైన శైలిలో నటించి సీన్స్​ పండించారు.

ఇదీ చూడండి: చిరు 'వాల్తేరు వీరయ్య' 17 డేస్​ కలెక్షన్స్​.. ఊహించని రేంజ్​లో బాక్సాఫీస్​ షేక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.