ETV Bharat / entertainment

NBK 107: స్పెషల్​ సాంగ్​లో బాలయ్య స్టైలిష్​ లుక్​ సూపర్​

author img

By

Published : May 17, 2022, 10:47 PM IST

Balakrishna Gopichand malineni movie special song: బాలకృష్ణ-గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న సినిమా.. ప్రస్తుతం ఓ స్పెషల్ సాంగ్​ చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సాంగ్​ సెట్స్​లోని బాలయ్య న్యూ లుక్​ బయటకు వచ్చింది. ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.

Balakrishna Gopichand malineni special song photo
స్పెషల్​ సాంగ్​లో బాలయ్య స్టైలిష్​ లుక్​ సూపర్​

Balakrishna Gopichand malineni movie special song: బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓ స్పెషల్​ సాంగ్​ను తెరకెక్కిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా సెట్స్‌ని తీర్చిదిద్దారు. అయితే తాజాగా సెట్స్​లోని బాలయ్యకు సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చింది. ఇందులో బాలయ్యతో దర్శకుడు గోపిచంద్​ మలినేని, మ్యూజిక్ డైరెక్టర్​ తమన్​, కొరియోగ్రాఫర్​ శేఖర్ మాస్టర్​ సెల్ఫీ దిగుతూ కనిపించారు. బాలయ్య స్టైలిష్​ లుక్​ కూడా అదిరిపోయింది. ఇది చూసిన అభిమానులు ఫొటోను సోషల్​మీడియాలో ట్రెండ్​ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ స్పెషల్​ సాంగ్​లో డింపుల్ హయాతి ఆడిపాడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు 'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాలో నటించిన చంద్రికా రవి ఈ ప్రత్యేక గీతంలో చిందులేయనుందని అంటున్నారు. ఇంతకీ వీరిద్దరిలో ఎవరు బాలయ్య సరసన స్టెప్పులేస్తున్నారో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. కాగా, ఈ చిత్రంలో దునియా విజయ్‌ ప్రతినాయకుడిగా, వరలక్ష్మీ శరత్​కుమార్​ కీలక పాత్ర పోషిస్తున్నారు. మలయాళ బ్యూటీ హనీరోజ్​ రెండో హీరోయిన్​గా కనిపించనుంది.

balayya 107 movie special song
స్పెషల్​ సాంగ్ సెట్​లో బాలయ్య

ఇదీ చూడండి: 'ఆనందాన్ని ఎవరు కోరుకోరు'.. ఈ సిగరెట్​​ యాడ్​ పాప అందాన్ని ఇప్పుడు చూస్తే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.