ETV Bharat / entertainment

'అవతార్ 2' తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే

author img

By

Published : Dec 17, 2022, 10:36 AM IST

Updated : Dec 17, 2022, 3:08 PM IST

సినీ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన భారీ విజువల్ వండర్​ 'అవతార్​ 2' రిలీజై పాజిటివ్​ టాక్​ను తెచ్చుకుంది. ఈ సినిమా తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే..

Avatar 2 Collections
'అవతార్ 2' తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే

యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'అవతార్‌2' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో వచ్చిన అవతార్ విజువల్‌ వండర్‌గా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన సంగతి తెలిసిందే. తొలి భాగంలో పండోరా అందాలను అద్భుతంగా ఆవిష్కరించిన కామెరూన్‌.. ఈ సారి సీక్వెల్​తో నీటి అడుగున అందాలు, భారీ జలచరాలతో సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. దాదాపు రూ.3వేల కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్​ టాక్​ను తెచ్చుకుంది. విజువల్స్​ పరంగా సినిమా అద్భుతంగా ఉందని సినీ ప్రేక్షకులు అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా తొలి కలెక్షన్స్​ గురించి వివరాలు బయటకు వస్తున్నాయి. సినీ విశ్లేషకుడు రమేశ్​ బాలా ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా(రెండు రోజుల్లో) రూ.300కోట్లు వరకు వసూలు చేసిందని అన్నారు. అలానే భారత్​లో తొలి రోజు రూ.58కోట్లు కలెక్ట్​ చేసిందని చెప్పుకొచ్చారు.

అయితే పలు సినిమా వెబ్​సైట్లు ఇచ్చిన ప్రకారం ఈ చిత్రం తొలి రోజు భారత్​లో రూ.35-38కోట్లు నెట్​ వసూలు చేసినట్లు రాశాయి. 2022లో ఇండియన్​ బాక్సాఫీస్​లో తొలి రోజు ఎక్కువ వసూలు చేసిన హాలీవుడ్​ చిత్రం ఇదేనని పేర్కొన్నాయి. ఆ తర్వాత డాక్టర్ స్ట్రేంజ్​(రూ.28.35కోట్లు), థో లవ్​ అండ్​ థండర్​(18.2కోట్లు), బ్లాక్​ ప్యాంతర్​(12కోట్లు), జురాసిక్​ వరల్డ్​(8కోట్లు), బ్లాక్ అడమ్​(6.8కోట్లు), ది బ్యాట్​మన్​(6.66కోట్లు) నెట్​ కలెక్ట్​ చేసినట్లు పేర్కొన్నాయి.

మొత్తంగా చూస్తే ఇండియన్​ బాక్సాఫీస్​లో తొలి రోజు ఎక్కువ వసూలు చేసిన సినిమాగా అవెంజర్స్​ ఎండ్​ గేమ్​ నిలిచింది. 2019లో విడుదలైన ఈ చిత్రం రూ.53.1కోట్లు నెట్​ వసూళ్లు అందుకుందట. ఆ తర్వాత రెండో స్థానంలో అవతార్ 2(రూ.35-38కోట్లు) నిలిచింది. ఆ తర్వాత స్పైడర్ మ్యాన్​ ఫార్​ ఫ్రమ్​ హోమ్​, అవెంజర్స్​ ఇన్ఫినిటీ వార్​, డాక్టర్​ స్ట్రేంజ్​, థోర్​ లవ్​ అండ్​ థండర్​, కెప్టెన్ మార్వల్​, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7​, బ్లాక్ ప్యాంతర్​, ది లయన్ కింగ్స్, ది అవెంజర్స్​, ది జంగిల్​ బుక్​, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్​ 8, మిషన్ ఇంపాజిబుల్​ 6, డెడ్​ పూల్​ 2, జురాసిక్​ వరల్డ్​ డొమినియన్​, థోర్​ రగ్​నరోక్​ వరసగా స్థానాల్లో నిలిచాయి.

ఇదీ చూడండి: టైటానిక్​ హీరోయిన్​ సాహసం.. అవతార్​ 2 కోసం నీటిలో 7 నిమిషాలు ఊపిరి తీసుకోకుండా..

Last Updated : Dec 17, 2022, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.