రెక్కలు కట్టుకొని వందరోజుల్లో మీ ముందుకు 'అవతార్​ 2'

author img

By

Published : Sep 9, 2022, 8:51 AM IST

Avatar 2 Movie

అవతార్‌తో ప్రేక్షకుల్ని పండార గ్రహంలో విహరింపజేసిన జేమ్స్‌ కామెరూన్‌, ఇప్పుడు 'అవతార్‌ 2'తో మరో సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన కొత్త కబురుని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

Avatar 2 Movie : సినీ ప్రియుల్ని ఓ సరికొత్తలోకంలో విహరింప చేసిన చిత్రం 'అవతార్‌'. జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టిని చూసి వావ్‌ అనని వారు లేరు. అంతకుమించిన రీతిలో అవతార్‌ సిరీస్‌లో మరిన్ని చిత్రాలు తీసుకురావడానికి కామెరూన్‌ ఏళ్లతరబడి కృషి చేస్తున్నారు. ఈ ఏడాది మరోసారి అవతార్‌ హంగామా వెండితెరపై ప్రేక్షకులు చూడబోతున్నారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన కొత్త కబురుని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

Avatar 2 Movie
.

'అవతార్‌..ది వే ఆఫ్‌ వాటర్‌'ను రానున్న వందరోజుల్లో మీ ముందుకు తీసుకొస్తున్నాం అంటూ ప్రత్యేకమైన పోస్టర్‌ను పంచుకుంది. భారీ రెక్కలు ఉన్న ఓ వింతజీవిపై ఎక్కి నీటిలోంచి పైకి వస్తున్న అవతార్‌ కథానాయకుడు ఇందులో కనిపిస్తాడు. ఈ ఏడాది డిసెంబరు 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పండోరా గ్రహాన్ని మించిన వింతలు విశేషాల కోసం అవతార్‌ అభిమానులు మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

ఇవీ చదవండి: సోహైల్​ ఖాన్​ మాజీ భార్య సో హాట్​ గురూ!

ఆ సినిమా కోసం మరింత నాజూగ్గా ఎన్టీఆర్​... చైతూ కొత్త సినిమా షురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.