ETV Bharat / entertainment

త్రివిక్రమ్.. అర్జున్ దాస్​ను లైన్​లో పెడుతున్నాడా?

author img

By

Published : Feb 3, 2023, 3:03 PM IST

Updated : Feb 3, 2023, 3:22 PM IST

మ్యాన్లీ లుక్స్​తో, బోల్డ్​ వాయిస్​తో ఆడియెన్స్​ను ఆకట్టుకున్న నటుడు అర్జున్​ దాస్​ను తన సినిమాలోకి తీసుకోవాలని దర్శకుడు త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడట. ఆ వివరాలు..

.
.

మ్యాన్లీ లుక్స్​తో, బోల్డ్​ వాయిస్​తో ఫ్యాన్​ ఫాలోయింగ్ పెంచుకున్న నటుడు అర్జున్‌దాస్‌. ఖైదీ, మాస్టర్‌, విక్రమ్‌ తదితర చిత్రాల్లో కీలకపాత్ర పోషించి.. తన గంభీరమైన గొంతుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ​ దీంతో ఇండస్ట్రీలో ఆయనకు డిమాండ్ పెరిగింది. ఇక తెలుగులోనూ ఛాన్స్​లను అందుకుంటున్నాడు. ఫిబ్రవరి 4న 'బుట్టబొమ్మ' చిత్రంతో టాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆక్సిజన్‌ అనే చిత్రంలోనూ కీలకపాత్ర పోషించాడు. అయితే ఇప్పుడతడికి మరో మంచి అవకాశం వరించినట్లు తెలుస్తోంది.

సూపర్​స్టార్ మహేశ్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబోలో రూపొందుతున్న SSMB 28 చిత్రంలో నటించబోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో అతడు వైల్డ్​గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ప్రతినాయకుడి పాత్ర అని సమాచారం. ప్రస్తుతం ఈ విషయంలో సోషల్​మీడియాలో ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇకపోతే అర్జున్ దాస్​ తాజాగా నటించిన బుట్టబొమ్మ ఫిబ్రవరి 4న విడుదల కానుంది. అనికా సురేంద్రన్‌, సూర్య వశిష్ఠ, అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శౌరి చంద్రశేఖర్‌ రమేష్‌ తెరకెక్కించారు.

ఇంకా ssmb 28 విషయానికొస్తే.. దీనిపై భారీగా అంచనాలు ఉన్నాయి. పూజా హెగ్డే, శ్రీలీలలు హీరోయిన్స్​గా నటిస్తున్నారు. ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోని ఈ సినిమాకు అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్​ భారీగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్​ రైట్స్, థియేట్రికల్​ బిజినెస్ కలిపి​ దాదాపు రూ.300కోట్ల వరకు జరిగిందని తెలిసింది.

ఇదీ చూడండి: ఏంది మళ్లీనా.. చిరు-బాలయ్య గ్యాప్​ ఇవ్వట్లేదుగా!

Last Updated : Feb 3, 2023, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.