ETV Bharat / entertainment

'ఆదిపురుష్​' టీమ్​కు షాక్.. రిలీజ్​పై స్టే విధించాలని పిటిషన్ దాఖలు

author img

By

Published : Oct 8, 2022, 2:34 PM IST

Updated : Oct 8, 2022, 4:35 PM IST

stay on Adipurush movie
stay on Adipurush movie

'ఆదిపురుష్​' సినిమా రిలీజ్​పై స్టే విధించాలని కోరుతూ దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. రాముడిని, హనుమంతుడిని తప్పుగా చూపించారని పిటిషన్​లో పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే..

'ఆదిపురుష్​' సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. రాముడు, హనుమంతుడిని తోలు పట్టీలు ధరించి అసమంజసమైన ధోరణిలో చూపించారని పిటిషన్​లో ఆరోపించారు. రావణుడ్ని కూడా తప్పుగా చూపించారని పేర్కొన్నారు. రామాయణాన్ని వక్రీకరించారని ఆదిపురుష్​ నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు, సహ నిర్మాత ఓం రౌత్​ మీద.. అడ్వకేట్​ రాజ్​ గౌరవ్​ కోర్టులో పిటిషన్ వేశారు. సినిమా విడుదలను ఆపేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్​లో కోరారు.

"ఆదిపురుష్​ టీజర్​లో రాముడిని, హనుమంతుడిని తప్పుగా చూపించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. రాముడు సౌమ్య స్వభావం క్షమా గుణం కలవాడు. అలాంటి వాడిని తోలు పట్టీలు, పాద రక్షలు ధరించిన వాడిగా చూపించారు. దారుణాలు చేసే వాడిగా, ప్రతీకారం తీర్చుకునేవాడిగా, కోపంగా చూపించారు. దాంతో పాటు గొప్ప శివ భక్తుడు, బ్రాహ్మణుడు అయిన రావణుడిని కూడా చాలా చీప్​గా, భయంకరంగా చిత్రీకరించారు. సినిమా టీజర్ చాలా దారుణంగా ఉంది. మతపరమైన మనోభావాలు దెబ్బతీస్తున్న దృష్ట్యా జనవరి 12 2023న విడుదల కానున్న ఈ సినిమాను పూర్తిగా నిషేధించాలి. భారతదేశం సహా ఇతర ప్రాంతాలలోని హిందువుల ఆకాంక్షలు, మనోభావాలను కాపాడాలి" అని పిటిషన్​లో పేర్కొన్నారు. అలాగే విడుదలైన ఆదిపురుష్​ టీజర్​ను అన్ని సమాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా ఆధేశించాలని పిటిషన్​ ద్వారా కోరారు.

కాగా, టీజర్ విడుదలైనప్పటి నుంచి 'ఆదిపురుష్​'పై ట్రోలింగ్ విపరీతంగా జరుగుతోంది. వీఎఫ్​ఎక్స్​ బాగోలేదంటూ.. రాముడు, ఆంజనేయుడు, రావణుడ్ని తప్పుగా చూపించారంటూ విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. అయితే ట్రోలింగ్​పై దర్శకుడు ఓం రౌత్​ వివరణ కూడా ఇచ్చారు. ఈ​ సినిమా పెద్ద స్క్రీన్​ కోసం తీశామని చెప్పారు. సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని.. కావాలంటే నోట్​ రాసిస్తానని చెప్పారు.

అంతకముందు గురువారం హైదరాబాద్​లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ టాలీవుడ్​ నిర్మాత దిల్​ రాజు సైతం ట్రోలింగ్​ పై స్పందించి.. ఆదిపురుష్​ టీమ్​కు బాసటగా నిలిచారు. ఏ సినిమా అయినా సాధారణ ప్రేక్షకుడికి నచ్చితే చాలు అని చెప్పారు. ఇలా ట్రోలింగ్​ వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద విజయం సాధించాయని తెలిపారు. అనంతరం ప్రొడక్షన్​ బ్యానర్లైన టీ సిరీస్​, రెట్రోఫైల్స్​ అధినేతలు తమ చిత్రాన్ని చూసి ఆదరించవలసిందిగా కోరారు.

ఇవీ చదవండి : 'రామాయణానికి భిన్నంగా 'ఆదిపురుష్‌''.. క్లారిటీ ఇచ్చిన ఓం రౌత్‌

'ఆదిపురుష్'​ అందరికీ నచ్చుతుంది.. కావాలంటే నోట్​ రాసిస్తా: ఓం రౌత్

Last Updated :Oct 8, 2022, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.