ETV Bharat / entertainment

'ఆదిపురుష్'​ అందరికీ నచ్చుతుంది.. కావాలంటే నోట్​ రాసిస్తా: ఓం రౌత్

author img

By

Published : Oct 8, 2022, 2:01 PM IST

Updated : Oct 8, 2022, 3:52 PM IST

Adipurush Trolls : 'ఆదిపురుష్‌' టీజర్‌కు వస్తోన్న ప్రతికూల స్పందనలపై ఓం రౌత్‌ తాజాగా మరోసారి స్పందించారు. సినిమా గురించి తాను పూర్తి నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు. ప్రేక్షకులకు త్రీడీలో టీజర్ చూపించాలని 60కి పైగా థియేటర్లలో విడుదల చేశారు.

om raut expressed confidence
om raut expressed confidence

Adipurush Trolls : 'ఆదిపురుష్‌'పై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు దర్శకుడు ఓం రౌత్‌ తెలిపారు. ఈ సినిమా టీజర్‌కు వస్తోన్న ప్రతికూల స్పందనలపై ఆయన మరోసారి స్పందించారు. బిగ్‌ స్క్రీన్‌ కోసమే ఈ చిత్రాన్ని సిద్ధం చేశామన్నారు. "టీజర్‌ విషయంలో చాలా విమర్శలు వస్తున్నాయి. టీజర్‌లో కేవలం పాత్రల్ని మాత్రమే పరిచయం చేశాం. చిన్న వీడియోను చూసి సినిమాపై అంచనాకు రావొద్దు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా విడుదలయ్యాక.. చూసి ఎవరూ నిరాశచెందరు. కావాలంటే నోట్‌ రాసిస్తా. తప్పకుండా సినిమా అందర్నీ అలరిస్తుంది" అని ఓం రౌత్‌ అన్నారు.

ప్రభాస్‌ నో అంటే చేసేవాడిని కాదు!
"ప్రభాస్‌ కోసమే రాఘవ పాత్ర రాశాను. కథ రాస్తున్నంతసేపు నా మైండ్‌లో ప్రభాసే ఉన్నాడు. ఆయన కోసమే సినిమా తెరకెక్కించా. ఆయన నో అంటే సినిమా చేసేవాణ్ని కాదు. ఆయన అద్భుతంగా నటించారు" అని ఓం రౌత్ వివరించారు.

రామాయణాన్ని ఆధారంగా చేసుకుని 'ఆదిపురుష్‌'ను రూపొందించారు. ప్రభాస్‌ రాముడిగా నటించగా కృతి సనన్‌ సీతగా చేసింది. రావణాసురుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌లో నటీనటుల లుక్స్‌, వీఎఫ్‌ఎక్స్‌ సరిగ్గా లేవని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాపై కాపీ కొట్టారనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఇటీవల ఓ యానిమేషన్​ సంస్థ ఘాటు వ్యాఖ్యలు చేసింది. 'సిగ్గుచేటు ఒరిజినల్​ క్రియేటర్​ ఎవరో చెప్పాలి' అంటూ విమర్శలు చేసింది. సినిమాలోని వీఎఫ్​ఎక్స్​ కూడా నాసి రంకంగా ఉన్నాయని భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దర్శకనిర్మాతలు ఎంత చెబుతున్నా ట్రోలింగ్ ఆగలేదు. ఆఖరికి గురువారం టీజర్​ను తెలుగులో త్రీజీలో దాదాపు 60 థియేటర్లలో స్క్రీనింగ్​ చేశారు.

అంతక ముందురోజు ఓ సమావేశం నిర్వహించి మరీ దర్శకనిర్మాతలు తాము చేసిన సినిమా అందరికీ నచ్చుతుందని చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా పెద్ద స్క్రీన్స్​ కోసం తీశామని చెప్పారు. అటు తెలుగు నిర్మాత దిల్​ రాజు సైతం ట్రోలింగ్​ పై స్పందించి.. ఆదిపురుష్​ టీమ్​కు బాసటగా నిలిచారు. ఏ సినిమా అయినా సాధారణ ప్రేక్షకుడికి నచ్చితే చాలు అని చెప్పారు. ఇలా ట్రోలింగ్​ వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద విజయం సాధించాయని తెలిపారు. అనంతరం ప్రొడక్షన్​ బ్యానర్లైన టీ సిరీస్​, రెట్రోఫైల్స్​ అధినేతలు తమ చిత్రాన్ని చూసి ఆదరించవలసిందిగా కోరారు.

అయితే ఇలాంటి ట్రోలింగ్​ వల్ల దర్శకనిర్మాతల్లో ఉత్సాహం దెబ్బతింటుందని పలువులు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. బాలీవుడ్​లో ఓ వర్గాన్ని టార్గెట్​గా చేసుకుని బాయ్​కాట్​ ట్రెండ్​ నడుస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ మాత్రం ప్రేక్షకుల అంచనాలను 'ఆదిపురుష్' టీజర్ అందుకోలేకపోవడం.. సినిమాలోని పాత్రలను తప్పుగా చూపించారనే కారణాలే ప్రస్తుతం జరుగుతున్న ట్రోలింగ్​కు​ దారితీస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి: ప్రభాస్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. 'రెబల్'​ రీరిలీజ్.. ఎప్పుడంటే?

వెట్రిమారన్‌, కమల్‌ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. భాజపా నేతలు ఫైర్​!

Last Updated :Oct 8, 2022, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.