ETV Bharat / entertainment

సంక్రాంతి 2024 - ఈ స్టార్​ హీరోల సినిమాలు ఏ ఓటీటీలో వస్తున్నాయంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 5:06 PM IST

2024 Sankranthi Releases : ఈ సంక్రాంతి పండక్కి నాలుగు తెలుగు చిత్రాలు, రెండు తమిళ చిత్రాలు బరిలో ఉన్నాయి. ఈ చిత్రాల ఓటీటీ వివరాలు స్టోరీలో తెలుసుకుందాం.

Sankranthi OTT Releases
Sankranthi OTT Releases

2024 Sankranthi Movies : ఈ సారి సంక్రాంతి 2024 పండగ బరిలో 6 సినిమాలు దిగుతున్నాయి. 'గుంటూరు కారం', 'సైంధవ్', 'నా సామిరంగ', 'హనుమాన్' చిత్రాలే కాకుండా తమిళ డబ్బింగ్​ చిత్రాలైన 'కెప్టెన్ మిల్లర్', 'అయలాన్' కూడా బరిలో ఉన్నాయి. ఈ చిత్రాలను థియేటర్లలో చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అన్ని పెద్ద సినిమాలే కావడం వల్ల థియేటర్స్ కొరతతో ప్రస్తుతం పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇదే సమయంలో ఈ చిత్రాల ఓటీటీ రిలీజ్ వివరాలను కూడా వెతికేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సంక్రాంతి సినిమాల ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి.

Gunturu Kaaram OTT Release : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా - త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన తాజా చిత్రం 'గుంటూరు కారం'. శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను భారీ ధరకు విక్రయించిందని టాక్​ నడుస్తోంది.

Hanuman Movie OTT Release : ప్రశాంత్ వర్మ - తేజ సజ్జ కాంబోలో తెరకెక్కిన చిత్రం 'హనుమాన్'. దాదాపు 11 భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థం జీ5 దక్కించుకుంది. శాటిలైట్ రైట్స్ కూడా జీ5 దక్కించుకున్నట్లు సమాచారం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Saindhav OTT Release : శైలేష్ కొలను - విక్టరీ వెంకటేశ్​ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ సైంధవ్. యాక్షన్ థ్రిల్లర్​గా రానున్న ఈ చిత్రంలో నవాజుద్ధిన్ సిద్ధిఖ్​​, ఆండ్రియా జెర్మియా, శ్రద్ధా శ్రీనాథ్, ఆర్య, జయప్రకాశ్, జిషు సేన్‌ గుప్తా కీలక పాత్రలు పోషించారు. సంతోశ్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే శాటిలైట్ రైట్స్​ను మాత్రం ఈటీవీ దక్కించుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Naa Saami Ranga OTT Release : నాగార్జున ప్రధాన పాత్రలో విజయ్ బిన్ని రూపొందించిన చిత్రం 'నా సామి రంగ'. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్​గా రూపొందిన ఈ సినిమా 1980 - 1990 బ్యాక్​ డ్రాప్​లో సాగనుంది. చిత్రంలో నాగార్జునతో పాటు అల్లరి నరేశ్​, రాజ్​ తరుణ్​, ఆశికా రంగనాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఓటీటీ రైట్స్​ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకుంది. శాటిలైట్ రైట్స్​ను స్టార్ మా సొంతం చేసుకుంది. తమిళ డబ్బింగ్ చిత్రాలు 'కెప్టెన్ మిల్లర్', 'అయలాన్' కూడా - ప్రైమ్ వీడియోలో రానున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'గుంటూరు కారం' ఆల్ టైం రికార్డ్ - RRR రేంజ్​లో రిలీజ్​​!

మహేశ్​ను దాటేసిన తేజ సజ్జ - సంక్రాంతి సినిమాల్లో 'హనుమాన్' టాప్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.