ETV Bharat / crime

'రెక్కీ నిర్వహించారు.. మా ప్రాణాలు కాపాడండి'... ఎస్పీకి వైఎస్ వివేకా కుమార్తె సునీత లేఖ

author img

By

Published : Aug 13, 2021, 4:32 PM IST

Updated : Aug 13, 2021, 8:50 PM IST

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీత.. కడప ఎస్పీకి లేఖ రాశారు. పులివెందులలో తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు.

sunitha
సునీత

ఏపీలోని పులివెందులలో తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరుతూ ఆ రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీత... కడప ఎస్పీకి లేఖ రాశారు. ఈ నెల 10న మణికంఠరెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని ఆమె లేఖలో వెల్లడించారు. మణికంఠరెడ్డిని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనుచరుడుగా సునీత ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ఆమె.. ఎస్పీ లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి లేఖను అందించారు.

స్పందించిన ఎస్పీ

సునీత రాసిన లేఖపై కడప ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. పులివెందులలోని సునీత ఇంటి వద్ద వెంటనే పోలీస్‌ పికెట్ ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. సునీత లేఖలోని ఇతర అంశాలపైనా విచారణ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

కొనసాగుతున్న వివేకా హత్య కేసు విచారణ

వివేకా హత్య కేసులో 68 రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప, పులివెందుల ప్రాంతాల్లో రెండు బృందాలుగా విడిపోయిన అధికారులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇవాళ పులివెందుల ఆర్​అండ్​బీ అతిథి గృహంలో ఏపీ వైకాపా కార్యదర్శి ఉమా శంకర్​రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్​రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇతను ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతోపాటు కేసులో కీలక అనుమానితులుగా ఉన్నాడు.

పులివెందుల క్యాంపు కార్యాలయంలో పనిచేసే రఘునాథ్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నారు. కడపలో కూడా మరో నలుగురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. వివేకా కారు డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు.. నిన్న రాత్రి నుంచి విచారణ చేస్తున్నారు. కస్టడీలో ఉన్న సునీల్ యాదవును కూడా ప్రశ్నిస్తున్నారు. అతని బంధువు భరత్ యాదవ్‌ను కూడా నేడు విచారించనున్నారు. సునీల్‌ను కలిసేందుకు అతని తల్లి సావిత్రి, భార్య లక్ష్మి కడప కేంద్ర కారాగారానికి వచ్చారు. సాయంత్రం కొందరు అనుమానితులను సీబీఐ అధికారులు పులివెందులలో విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: baby died: 'జామకాయ' ఆ పసిపాపను చంపేసింది!

Last Updated : Aug 13, 2021, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.