ETV Bharat / crime

గొంతులో ఇరుక్కుపోయిన మాంసం ముక్క.. తరువాత ఏమైందంటే..

author img

By

Published : Nov 10, 2021, 8:33 AM IST

మహబూబ్​నగర్​ జిల్లా కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని చేదు గుట్ట తండాలో అపశ్రుతి చోటుచేసుకుంది. శుభకార్యంలో జరిగిన విందులో భోజనం చేస్తుండగా గొంతులో మాంసం ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి చెందాడు.

person died by mutton piece
గొంతులో ఇరుక్కుపోయిన మాంసం ముక్క

గొంతులో మాంసం ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబ్​నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి పంచాయతీలోని చేదు గుట్ట తండాలో చోటుచేసుకుంది. తండాలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లిన చంద్రు నాయక్(59).. మంగళవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు విందు భోజనం చేస్తుండగా గొంతులో మాంసం ముక్క ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక చాలా సేపు ఇబ్బంది పడ్డారు. అతడిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పరీక్షించిన వైద్యులు.. చంద్రు నాయక్​ చనిపోయినట్లుగా నిర్ధరించారు.

చంద్రు నాయక్​ మృతిచెందడంతో తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇదీ చదవండి: Adulterated Meat: ముక్క లేనిదే ముద్ద దిగదా..? అయితే జాగ్రత్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.