ETV Bharat / crime

విషాదం: ఒకేరోజు తండ్రి తనయుల మృతి

author img

By

Published : May 9, 2021, 7:35 PM IST

మెదక్ జిల్లాలో పడాలపల్లిలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఒకే రోజు తండ్రి, కుమారుడు మృతిచెందారు. తూప్రాన్‌ పురపాలిక పరిధిలో ఈ ఘటన జరిగింది.

son and father died with in one day
అనారోగ్యంతో తండ్రి, కొడుకు మృతి

కొవిడ్ మహమ్మారి ఆ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. మెదక్ జిల్లా తూప్రాన్‌ పురపాలక పరిధిలోని పడాలపల్లిలో అనారోగ్యంతో తండ్రి, కొడుకు మృతి చెందారు. ఈ ఇద్దరి మరణంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గ్రామానికి చెందిన కానుకుంట యాదయ్య (65) అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే మృత్యువాత పడ్డాడు. శ్వాసకోస సంబంధిత సమస్యతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని కుమారుడు కృష్ణ (35) తండ్రి మరణించిన గంటసేపటికే మృతి చెందాడు. కేవలం గంట వ్యవధిలో ఇద్దరూ మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పడాలపల్లిలో కౌన్సిలర్ అరుణ వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇదీ చూడండి: వామనరావు దంపతుల హత్య కేసులో పుట్ట మధు భార్యను విచారిస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.