ETV Bharat / crime

Road Accident: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి దుర్మరణం

author img

By

Published : Jun 9, 2022, 6:59 PM IST

రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం

Road Accident: గచ్చిబౌలి పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Road Accident: హైదరాబాద్​ గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. గౌలిదొడ్డిలో ఉంటున్న జయకృష్ణ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్​వేర్​ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఆఫీసుకు తన ద్విచక్రవాహనంపై బయలు దేరారు. ఐఎస్‌బీ వద్దకు రాగానే ఎదురుగా ఉన్న డివైడర్​ను ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే అతన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరిలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: అంత్యక్రియలకు వెళ్తూ... ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

అత్యాచార నిందితులకు నిప్పు.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.