ETV Bharat / bharat

అత్యాచార నిందితులకు నిప్పు.. ఒకరు మృతి

author img

By

Published : Jun 9, 2022, 1:43 PM IST

Updated : Jun 9, 2022, 2:28 PM IST

అత్యాచార నిందితులకు నిప్పంటించారు ఝార్ఖండ్​లోని గుమ్లా ప్రాంత ప్రజలు. బాధితులను అధికారులు ఆస్పత్రికి తరలించారు. ముంబయిలో జరిగిన మరో ఘటనలో ఓ యువతిని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ దుండగుడు.

అత్యాచార నిందితులకు నిప్పంటించిన గ్రామస్థులు
అత్యాచార నిందితులకు నిప్పంటించిన గ్రామస్థులు

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులకు గ్రామస్థులు నిప్పటించారు. నిందితులను ఆస్పత్రికి తరలించగా ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని గుమ్లా జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇందుకు కారణమైన వారిపై తగిన చర్యలు చేపడతామని వెల్లడించారు.

యువతిపై దాడి..: లోకల్​ ట్రైన్​లో ప్రయాణిస్తున్న యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ దుండగుడు. బ్యాగ్​, మొబైల్​ లాక్కునేందుకు ప్రయత్నించగా బాధితురాలు ప్రతిఘటించడం వల్ల ఈ చర్యకు పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం ముంబయిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పప్పూగుప్తాగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం: మహిళల కోసం కేటాయించిన కోచ్​లో ఒంటరిగా బాధితురాలు ప్రయాణిస్తుండగా.. పప్పూ గుప్తా కంపార్ట్​మెంట్​లోకి వచ్చి యువతి పక్కన కుర్చున్నాడు. బాధితురాలు అక్కడి నుంచి లేచి డోర్​ దగ్గర నిలబడింది. చుర్నీ రోడ్​ స్టేషన్​ దాటగానే.. నిందితుడు ఆమె బ్యాగ్​, మొబైల్​ ఫోన్​ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాధితురాలు ప్రతిఘటించగా.. ఆమె జుట్టు పట్టుకుని పెదాలను కొరికాడు. ఆ తర్వాత ఆమె బ్యాగ్​, ఫోన్లను లాక్కున్నాడు. బాధితురాలు సాయం కోసం అరిచేసరికి నిందితుడు ఛైర్చ్​గేట్​ స్టేషన్​ వద్ద రైలు నుంచి దూకి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

టీచర్​పై పోక్సో చట్టం: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఓ టీచర్​ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అరెస్ట్​ చేశారు. ఓ విద్యార్థిని సంబంధించిన ప్రైవేట్​ ఫొటోలు లీక్​ చేయడమే అందుకు కారణం. ఆమె పెళ్లిని రద్దు చేయించాలనే దుర్బుద్ధితో నిందితుడు వాట్సాప్​ స్టేటస్​లలో ఆ ఫొటోలు పెట్టి వైరల్​ చేసినట్టు పోలీసులు తెలిపారు. 'పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో నిందితుడు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో ఆ పెళ్లిని ఆపేందుకు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు నిందితుడిని చితకబాది పోలీస్​ స్టేషన్​కు తీసుకువచ్చి ఫిర్యాదు చేశారు' అని పోలీసులు వెల్లడించారు.

కరాటే టీచర్​పై మరిన్ని ఫిర్యాదులు: మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో 11 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో గతవారం అరెస్ట్​ అయిన కరాటే టీచర్​పై మరిన్ని ఫిర్యాదులు వచ్చాయి. నిందితుడు గోపాల్​ రామేశ్వర్​ గోందనే అకృత్యాలకు తాము కూడా బాధితులమే అని మరో ఐదుగురు బాలికలు బుధవారం ఫిర్యాదు చేశారు. బాధితులపై గత ఆరు నెలలుగా నిందితుడు అత్యాచారానికి పాల్పడుతున్నాడని.. సైన్యంలో సెలెక్ట్​ అయ్యేలా శిక్షణ ఇప్పిస్తానంటూ నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి : కుమారుడి మృతదేహం ఇచ్చేందుకు లంచం డిమాండ్.. తల్లిదండ్రుల భిక్షాటన

Last Updated :Jun 9, 2022, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.