ETV Bharat / crime

Suryapet Student Ragging Case : ర్యాగింగ్‌ కేసులో ఆరుగురు వైద్య విద్యార్థులు సస్పెండ్

author img

By

Published : Jan 4, 2022, 11:54 AM IST

Updated : Jan 4, 2022, 4:02 PM IST

students suspended in ragging case
ఆరుగురు వైద్య విద్యార్థులు సస్పెన్షన్

11:49 January 04

Suryapet Student Ragging Case : వసతిగృహం నుంచి విద్యార్థులను శాశ్వతంగా పంపించేస్తూ ఉత్తర్వులు

Suryapet Student Ragging Case : సూర్యాపేట మెడికల్ కళాశాలలో ర్యాంగింగ్​కు పాల్పడిన ఆరుగురు సీనియర్ విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 2న సూర్యాపేట మెడికల్ కాలేజీలో సీనియర్ వైద్యార్థులు జూనియర్ విద్యార్థిని హస్టల్ గదిలో నిర్భందించి ర్యాగింగ్​కు పాల్పడిన విషయం తెలిసిందే. ఘటనపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ ఈ అంశానికి సంబంధించిన నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రత్యేకంగా కమిటీని సైతం ఏర్పాటు చేసింది.

కమిటీ విచారణలో ర్యాంగింగ్ ఘటన నిరూపణ కావటంతో బాధ్యులైన ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేస్తూ డీఎంఈ రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 2019 -20 సంవత్సరానికి సంబంధించిన జే.మహేందర్, జి.శశాంక్, పి.శ్రవణ్, ఏ.రంజిత్ సాయి, కె.హరీశ్, బి.సుజీత్​లను ఏడాది పాటు కళాశాల నుంచి సస్పెండ్ చిసి.. శాశ్వతంగా హాస్టల్ నుంచి తొలగించినట్టు ప్రకటించింది. ఇక ఈ మేరకు విద్యార్థులు తక్షణం హాస్టల్ ఖాళీ చేయాలని స్పష్టం చేసిన డీఎంఈ... వారి తల్లిదండ్రుల దృష్టికి సైతం విషయాన్ని తీసుకువెళ్లినట్టు వివరించారు.

ఇదీ చూడండి: Harish Rao on Suryapet Ragging Issue : 'ర్యాగింగ్ చేశారని రుజువైతే.. కఠిన చర్యలు తప్పవు'

Last Updated :Jan 4, 2022, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.