ETV Bharat / crime

బాలికపై ప్రభుత్వ పాఠశాలలో అత్యాచారం.. పోలీసుల అదుపులో యువకుడు

author img

By

Published : Apr 29, 2022, 4:35 PM IST

Updated : Apr 30, 2022, 7:02 AM IST

Rape on Minor Girl: సమాజంలో మానవత్వ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఆడపిల్ల ఒంటరిగా కనపడితే చాలు మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తున్నారు. తాజాగా హనుమకొండ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

kamalapur police station
కమలాపూర్ పోలీస్​స్టేషన్

Rape on Minor Girl: నమ్మి వచ్చిన ఎనిమిదో తరగతి బాలికపై ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణం హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని ఓ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. గ్రామస్థులు, కమలాపూర్‌ సీఐ మహేందర్‌రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. బాలికకు ఫోన్‌ చేసి మాయమాటలు చెప్పిన ఇదే గ్రామానికి చెందిన పస్తం శ్రీకాంత్‌(22) అనే యువకుడు, రాత్రి సమయంలో ఆమెను పాఠశాల ఆవరణలోకి రమ్మని పిలిచాడు. నమ్మి వెళ్లిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

నిందితుడు శ్రీకాంత్​

అర్ధరాత్రి సమయంలో బాధితురాలి తండ్రి కమలాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందిత యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావటంపై సీఐ స్పందించారు. అత్యాచారానికి పాల్పడింది ఒక్కడేనని తేలిందన్నారు. ఇదే ఘటనలో లోతుగా విచారణ చేపట్టేందుకు మరో నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత బాలికను, నిందితుడిని హనుమకొండలోని భరోసా కేంద్రానికి తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు ప్రకారం నిందితుడిపై పోక్సో చట్టం, అత్యాచార కేసులు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

ఇదీ చదవండి: తండ్రిని చంపిన బాలిక.. ఆ కోపంతోనే హత్య!

క్యాబ్​ డ్రైవర్​ను హత్యచేసిన మైనర్లు.. 32సార్లు కత్తితో పొడిచి..

Last Updated : Apr 30, 2022, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.