ETV Bharat / crime

బావ డబ్బులపై కన్నేసిన బావమరిది.. ఏం చేశాడంటే..

author img

By

Published : Feb 8, 2023, 5:36 PM IST

Updated : Feb 8, 2023, 8:28 PM IST

Hyderabad Kidnapping Case
Hyderabad Kidnapping Case

Police Crack Hyderabad Kidnapping Case: హైదరాబాద్​లో కలకలం రేపిన పంజాగుట్ట కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో బాధితుని బావమరిదే ప్రధాన సూత్రధారి అని గుర్తించారు. మొబైల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.15 లక్షల నగదు, బుల్లెట్‌ వాహనం, 7 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Police Crack Hyderabad Kidnapping Case: ఇటీవల కాలంలో డబ్బు కోసం ఎన్నో అరాచకాలకు ఒడిగడుతున్నారు. మానవతా విలువలు మరిచిపోయి... అయిన వారు అని కూడా చూడకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పైసల కోసం ఓ బావమరిది.. ఏకంగా బావను కిడ్నాప్ చేసి డబ్బలు వసూలు చేశాడు. ఇందుకోసం నకిలీ ఐటీ అధికారుల అవతారమెత్తి.. బాధితుడిని భయభ్రాంతులకు గురి చేశారు.

గతనెల 27న జరిగిన ఈ ఘటనను పోలీసులు ఛేదించారు. విచారణలో భాగంగా పోలీసులకు కొన్ని ఆశ్చర్యపోయే అంశాలు తెలిశాయి. ఈ కిడ్నాప్ కేసులో బావమరిదే ప్రధాన సూత్రధారి అని వారు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్‌ వెల్లడించారు. రోడ్డుపై వెళుతున్న మురళీకృష్ణను ఇన్నోవాలో వచ్చిన నిందితులు ఐటీ అధికారులమని బెదిరించి అపహరించుకుపోయారని చెప్పారు. నగరశివారు బాటసింగారం వద్దకు తీసుకెళ్లగా భయపడిన మురళీకృష్ణ.. తన బావమరిది రాజేశ్‌ ద్వారా నిందితులు అడిగిన రూ.30 లక్షలు తెప్పించుకుని వారికి అప్పగించారని వివరించారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, మొబైల్ ఫోన్లు
పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, మొబైల్ ఫోన్లు

కిడ్నాపర్లు మురళీకృష్ణను ఓఆర్​ఆర్ వద్ద వదిలిపెట్టారని ఏసీపీ మోహన్‌కుమార్‌ చెప్పారు. ఆయన దీనిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దర్యాప్తులో భాగంగా మొబైల్‌ సిగ్నల్స్‌.. సీసీ టీవీ దృశ్యాల ఆదారంగా బావమరిది రాజేశ్‌ ప్రధాన సూత్రధారిగా తేల్చామని అన్నారు. ఈ కిడ్నాప్‌లో ప్రమేయమున్న అబ్దుల్ సలీం, లక్ష్మయ్య, కృష్ణ గోపాల్, శ్రీనివాస్ అలియాస్ వాసులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. గౌస్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు వివరించారు . నిందితుల నుంచి రూ.15 లక్షల నగదు, బుల్లెట్‌ వాహనం, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్‌ వెల్లడించారు.

ఇవీ చదవండి: ఐటీ అధికారులమని కిడ్నాప్.. డబ్బులు తీసుకున్నాక రిలీజ్..

Hyderabad Crime News: దోపిడీ చేసి.. తాపీగా నిద్రపోయారు

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. ఒంటెను దారుణంగా కొట్టి చంపిన గ్రామస్థులు

చిన్న పొరపాటు.. ఎయిర్​పోర్ట్​లోనే విమానం బోల్తా.. లక్కీగా..

Last Updated :Feb 8, 2023, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.