ETV Bharat / crime

ఐటీ అధికారులమని కిడ్నాప్.. డబ్బులు తీసుకున్నాక రిలీజ్..

author img

By

Published : Feb 5, 2023, 9:46 PM IST

ఐటీ అధికారులమంటూ ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అతని వద్ద నుంచి రూ.30 లక్షలు వసూలు చేసి.. బాధితుడిని విడిచిపెట్టారు. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

Hyderabad
Hyderabad

హైదరాబాద్‌లో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఓవర్‌సీస్‌ జాబ్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న అమీర్‌పేటకు చెందిన మురళీకృష్ణ.. గత నెల 27న లాల్‌బంగ్లా సమీపంలోని పాఠశాలలో పిల్లల్ని వదిలి వస్తుండగా కారుతో అయిదుగురు గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించారు. ఆదాయపన్ను అధికారులు అని చెప్పి అతనిని కారులో బలవంతంగా ఎక్కించుకున్నారు. ఆనంతరం కారులో బాటసింగారం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి రూ.60 లక్షలు ఆదాయపన్ను చెల్లించాలని తెలిపారు.

అందుకు మురళీకృష్ణ అంగీకరించకపోవడంతో కొట్టి.. బాధితుని భార్యను, బావమరిదిని అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. బావమరిదితో మాట్లాడించారు. భయపడిన మురళీకృష్ణ.. తన భార్యకు జరిగింది చెప్పి రూ.30 లక్షలు సిద్ధం చేయించాడు. బావమరిదిని డబ్బులు తీసుకొని నాంపల్లి స్టేషన్‌ వద్దకు రప్పించారు. అక్కడ బ్యాగు తీసుకున్న తర్వాత నిందితులు మురళీకృష్ణను హయత్‌నగర్ వద్ద వదిలేశారు.

అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న బాధితుడు మురళీకృష్ణ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇవీ చదవండి: బిల్లులు రాలేదని.. మరో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

అనేక ఇళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. గ్రామం విడిచి పారిపోయిన పురుషులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.