ETV Bharat / crime

PANJAGUTTA RAPE CASE: నర్సుపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

author img

By

Published : Dec 10, 2021, 9:15 PM IST

PANJAGUTTA RAPE CASE: ఆఫీసులో పని ఉందని పిలిచి నర్సుపై అత్యాచారానికి పాల్పడిన నిందితున్ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా నాగోలుకు చెందిన మల్లెల సాయిని రిమాండ్​కు తరలించారు.

PANJAGUTTA RAPE CASE
పంజాగుట్టలో నర్సుపై అత్యాచారం

PANJAGUTTA RAPE CASE: నర్సుపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితున్ని హైదరాబాద్​ పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ హెల్త్​కేర్​ సర్వీస్​లో నర్సుగా పనిచేస్తున్న మహిళపై మల్లెల సాయి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏపీలోని విజయవాడలో ఓ పేషంట్​ కోసం అత్యవసరంగా కార్యాలయానికి రావాలని పిలిపించి దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలు ఆఫీసుకు వెళ్లగానే.. మేడ మీద ఉన్న తన గదిలోకి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఘటనకు సంబంధించి బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Rape on nurse: బాధితురాలికి ఇదివరకే వివాహం కాగా.. కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుందని పోలీసులు తెలిపారు. బాధితురాలు ప్రస్తుతం పంజాగుట్టలోని ద్వారకాపూరి కాలనీలోని ఓ ప్రైవేట్​ హెల్త్​ కేర్​ సర్వీస్​లో నర్సుగా పని చేస్తోంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్​కు తరలించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.