ETV Bharat / crime

Oxygen Cylinder Blast in Hyderabad : అర్ధరాత్రి ఆక్సిజన్ సిలిండర్ పేలుడు.. తప్పిన ప్రాణనష్టం

author img

By

Published : Jan 24, 2022, 1:02 PM IST

అర్ధరాత్రి ఇంట్లో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పేలిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనతో ఆ భవనంలోని రెండు అంతస్తులు దెబ్బతిన్నాయి.

Oxygen Cylinder Blast in Hyderabad
Oxygen Cylinder Blast in Hyderabad

అర్ధరాత్రి 2.30 గంటల సమయం.. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా ఢామ్ అని శబ్ధం. బాంబ్​ పేలిందేమోనని నిద్రలో నుంచి అంతా ఉలిక్కిపడి లేచారు. చూస్తే తమ పక్క బిల్డింగ్​లో మంటలు చెలరేగాయి. దాదాపు రెండు అంతస్తులు దెబ్బతిన్నాయి. తలా ఓ చేయి వేసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటల వ్యాప్తి పెరగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. ప్రమాదానికి కారణం ఆక్సిజన్ సిలిండర్ పేలడమేనని గుర్తించారు.

ఆక్సిజన్ సిలిండర్ బ్లాస్ట్..

హైదరాబాద్ పాతబస్తీలోని మొఘల్​పురా హరిబౌలిబేలా కాలనీలో బ్లాక్​ నంబర్-14లో ఉన్న ఇంట్లో అర్ధరాత్రి 2.30 గంటలకు ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనతో భవనంలోని రెండు అంతస్తులు దెబ్బతిన్నాయి కానీ ఎవరికీ ప్రమాదం జరగలేదు.

అదే మంచిదైంది..

ఆ ఇంట్లో కరోనా రోగులు ఉండటం వల్ల ఆక్సిజన్ సిలిండర్ వాడుతున్నట్లు చుట్టుపక్కల వారు చెప్పారు. వాళ్లు ఇంట్లో లేకపోవడమే మంచిదైందని లేకపోతే ప్రాణాలు పోయేవని అన్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.

  • ఇదీ చదవండి : Mirchi Farmer Suicide: అప్పుల బాధతో మరో మిర్చి రైతు ఆత్మహత్య

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.