ETV Bharat / crime

ఇద్దరు అనాథ బాలికలపై అత్యాచారం..! నిందితుల్లో ఓ నిర్వాహకుడు..!!

author img

By

Published : Oct 26, 2022, 10:46 AM IST

Two orphan girls were raped: చిల్డ్రన్‌ హోంలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు అనాథ బాలికలపై నిర్వాహకుల్లో ఒకరు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. బాలికలు సఖి కేెంద్ర అధికారులకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిర్వాహకుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

Two orphan girls were raped
Two orphan girls were raped

Two orphan girls were raped: రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. నేరేడ్‌మెట్‌లోని ఓ చిల్డ్రన్‌ హోంలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు అనాథ బాలికలపై నిర్వాహకుల్లో ఒకరు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. బాలికలు ఈ నెల 19న సఖి కేంద్రం అధికారులకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. నిర్వాహకుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మురళిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద.. విక్టర్‌, అతని భార్యపై జువైనల్‌ జస్టిస్‌ చట్టం కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. కేసు వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.

బాలిక పరారీతో వెలుగులోకి: మేడ్చల్‌ జిల్లా పరిధిలోని నేరేడ్‌మెట్‌ క్రాస్‌ రోడ్డు సమీపంలో ఓ ప్రైవేటు సంస్థ చిల్డ్రన్‌ హోం పేరుతో అనాథ బాలికలకు, యువతులకు వసతి కల్పిస్తోంది. దాదాపు అయిదేళ్లుగా కొనసాగుతున్న ఆశ్రమంలో పదేళ్ల నుంచి 25 ఏళ్ల వయసుండే 36 మంది ఆశ్రయం పొందుతున్నారు. వారిలో ఒక మేజర్‌, ముగ్గురు మైనర్లు ఈ నెల 19న హోం నుంచి పారిపోయారు. మేజర్‌, మరో బాలిక కలిసి సంగారెడ్డికి వెళ్లారు.

అక్కడ మేజర్‌కు తెలిసిన ఒకరి ఇంట్లో ఆశ్రయం పొందారు. తమతో వచ్చిన ఇద్దరు బాలికల్ని మాత్రం సికింద్రాబాద్‌లో వదిలేశారు. ఎటు వెళ్లాలో తెలియని చిన్నారులు.. కొన్ని గంటల తర్వాత తిరిగి హోంకు చేరుకున్నారు. విషయం తెలిసి.. మహిళాశిశు సంక్షేమశాఖ, సఖి కేంద్రానికి చెందిన అధికారులు బాలికలతో ప్రత్యేకంగా మాట్లాడారు. పారిపోవడానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

తమపై అత్యాచారం జరిగినట్లు ఇద్దరు బాలికలు ఈ కౌన్సెలింగ్‌లో చెప్పారు. ఒకరిపై హోంలో.. మరొకరిపై బయట మరో ప్రాంతంలో అత్యాచారం జరిగినట్లు వెల్లడించారు. అనంతరం ఇద్దరు బాలికలను సఖి కేంద్రానికి పంపించారు. సంగారెడ్డిలో ఉన్న మేజర్‌, మరో బాలికను పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు.

బాలికలతో మసాజ్‌: బాలికల వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు మురళి.. బాలికలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలుస్తోంది. లైంగికంగా వేధించేవాడని, కాళ్లు పట్టించుకునేవాడని, మసాజ్‌ చేయించుకునే వాడని తెలిసింది.

మహిళాశిశు సంక్షేమశాఖ విచారణ: ఈ ఘటనపై మహిళాశిశు సంక్షేమశాఖ ప్రత్యేకంగా అంతర్గత విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అత్యాచార నేపథ్యంలో నేరేడ్‌మెట్‌ హోంలోని బాలికలను నింబోలిఅడ్డాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈ చిల్డ్రన్‌హోంను నిర్వహిస్తున్నట్లు తెలిసింది.


ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.