ETV Bharat / crime

ఛీ.. అసలు తల్లేనా? కూతుళ్లనే 'అమ్మ'కానికి పెట్టింది!

author img

By

Published : Dec 7, 2022, 3:17 PM IST

Mother is Forceing ProstitutionDaughters: అమ్మ అనే పేరుకు మచ్చ తెచ్చేవిధంగా చేసిందో పెంచిన తల్లి.. విద్యాబుద్ధులు చెప్పాల్సిన తల్లే.. తన పిల్లలను పాడు పనులకు వాడుకుంది. పిల్లలు తప్పులు చేస్తే దండించాల్సిన మాతృమూర్తే.. తప్పు చెయ్యండని వ్యభిచారం వైపు మళ్లించింది. ఈ ఘటన యాదగిరి భువనగిరి జిల్లాలో జరిగింది.

Kashai mother
కషాయి తల్లి

Mother is Forceing ProstitutionDaughters: శిశువులుగా ఉన్నప్పుడు ఇద్దరు బాలికలను కొనుగోలు చేసిన ఓ మహిళ.. వారు యుక్త వయసుకు చేరుకున్నాక బలవంతంగా వ్యభిచారం చేయించిన అమానుష ఉదంతం యాదగిరి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం అందడంతో 16 ఏళ్లలోపు వయసున్న బాధితురాళ్లిద్దరికీ విముక్తి కలిగించారు.

రాచకొండ పోలీస్‌కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నవంబరు 22న ఓ బాలిక జనగామ జిల్లా కేంద్రంలో బస్టాండ్‌వద్ద విలపిస్తూ కనిపించడంతో గమనించిన కొందరు 1098కు, 108కు ఫోన్‌చేసి సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆ బాలిక తన కుమార్తె అని.. తనకు అప్పగించాలంటూ సంరక్షణ కేంద్రం అధికారులను యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లి కాలనీకి చెందిన కంసాని అనసూయ కోరింది. దీంతో వాస్తవాల నిర్ధారణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా బాలల సంరక్షణ అధికారి(డీసీపీఓ) సైదులుకు సమాచారం ఇచ్చారు.

తన కుమార్తె అని ఒకసారి, తన చెల్లి కుమార్తె అని మరోసారి అనసూయ చెప్పింది. అనుమానం వచ్చిన డీసీపీఓ ఆరా తీయడంతో వాస్తవాలు బయటపడ్డాయి. ఇద్దరు బాలికలను శిశువులుగా ఉన్నప్పుడే అనసూయ కొనుగోలు చేసింది. యుక్త వయస్సుకు వచ్చాక వారితో వ్యభిచారం చేయించాలనుకుంది. కొన్నాళ్ల క్రితం వారిద్దరిని సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన తన బంధువు కంసాని శ్రీనివాస్‌ ఇంటికి పంపింది. అక్కడ వారితో బలవంతంగా వ్యభిచారం చేయించారు. ఇటీవల యాదగిరిగుట్టకు తీసుకువచ్చి వ్యభిచారం చేయించారు. అందుకు నిరాకరిస్తే కొట్టేవారు. ఈ బాధలు భరించలేక ఓ బాలిక తప్పించుకొని జనగామకు చేరింది. విచారణలో ఆమె ఈ విషయాలు వెల్లడించడంతో పోలీసులకు డీసీపీఓ సైదులు ఫిర్యాదు చేశారు. అనసూయను వారు అరెస్టు చేశారు. మరో బాలికనూ వ్యభిచార కూపం నుంచి రక్షించారు.

బాలికలిద్దర్నీ యాదాద్రి జిల్లా బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ కేసులో కంసాని శ్రీనివాస్‌తో పాటు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన చంద్ర భాస్కర్‌, కంసాని లక్ష్మి, కరీంనగర్‌ జిల్లా రామడుగుకు చెందిన చంద్ర కార్తిక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. యాదగిరిగుట్టకు చెందిన కంసాని ప్రవీణ్‌, హుస్నాబాద్‌కు చెందిన కంసాని స్వప్న, కంసాని అశోక్‌, రామడుగు గ్రామానికి చెందిన చంద్ర సరోజ పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులను జిల్లా సంరక్షణ, పిల్లల సంక్షేమ కమిటీ ఎదుట హాజరుపరిచినట్లు సీపీ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.