ETV Bharat / crime

బాలికపై అత్యాచారం.. ఏఆర్ హెడ్​కానిస్టేబుల్ సస్పెండ్​

author img

By

Published : Apr 28, 2022, 2:17 PM IST

Updated : Apr 28, 2022, 7:49 PM IST

minor girl raped in nizamabad district
బాలికపై అత్యాచారం.. నిందితుల్లో పెదనాన్న, ఏఆర్ హెడ్​కానిస్టేబుల్

14:12 April 28

minor girl raped in nizamabad district: మైనర్ బాలికపై.. పెదనాన్న, ఏఆర్​ హెడ్​కానిస్టేబుల్​ అత్యాచారం

minor girl raped in nizamabad district: సమాజంలో మానవత్వ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఆడపిల్ల ఒంటరిగా కనపడినా.. వాళ్లకి ముందూవెనుకా ఎవరూ లేరని తెలిసినా.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తున్నారు. వావివరుసలు మరిచి కామాంధులుగా మారి అమాయక ఆడపిల్లలను చెరబడుతున్నారు. బయట చెబితే చంపేస్తామంటూ బెదిరించి నెలలు, ఏళ్ల తరబడి వాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతూ.. వాళ్లలో ఆత్మ స్థైర్యాన్ని చంపేస్తూ.. సమాజంలో వారికంటూ ఓ గుర్తింపు లేకుండా వారి జీవితాలను అగమ్య గోచరం చేస్తున్నారు.

అబలలపై అన్యాయాలు జరిగిన ప్రతిసారీ.. సమాజంలో మార్పు రావాలని.. వాటిని వ్యతిరేకిస్తూ ఎన్ని కథనాలు రాసినా, బహిరంగ చర్చలు, సమావేశాలు జరిగినా.. మళ్లీ ప్రతి రోజు ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు చనిపోతే అన్నీ తానై చూసుకోవాల్సిన పెదనాన్న.. మరో కీచకుడితో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడి పాపం ఒడిగట్టుకున్నారు. నిజామాబాద్​ జిల్లాలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది.

మతిస్తిమితం లేని బాలికపై కొన్ని నెలలుగా ఆమె పెదనాన్న, ఏఆర్​ హెడ్ కానిస్టేబుల్​ అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు చనిపోతే పెదనాన్న ఇంట్లో ఉంటున్న ఆ బాలికను.. కూతురితో సమానంగా చూసుకోవాల్సిన ఆ దుర్మార్గుడు వావివరుసలు మరిచి ఆమె జీవితం అంధకారం చేశాడు. ఆ కామాంధుడికి తోడు బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ఏఆర్​ హెడ్​కానిస్టేబుల్​.. ఈ పాపంలో పాలుపంచుకోవడం జుగుప్స కలిగిస్తోంది. ప్రస్తుతం బాధితురాలు ఎనిమిది నెలల గర్భవతి. బుధవారం ఈ విషయం వెలుగుచూడటంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఏఆర్ హెడ్‌ కానిస్టేబుల్ చంద్రకాంత్​ను సీపీ నాగరాజు సస్పెండ్​ చేశారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.

ఇవీ చదవండి: మహిళపై హత్యాచారం.. పోలీసుల అదుపులో అనుమానితులు

అప్పులు చెల్లించలేక భార్యను అప్పగించిన భర్త!

Last Updated : Apr 28, 2022, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.