ETV Bharat / crime

పండ్ల రసం ఇప్పిస్తానని తీసుకెళ్లి బాలికపై అత్యాచారం

author img

By

Published : Apr 24, 2022, 8:21 AM IST

Updated : Apr 24, 2022, 9:42 AM IST

rape
rape

08:18 April 24

ఈనెల 22న బాలికపై అఘాయిత్యం

Minor Girl Raped: నిజామాబాద్ జక్రాన్‌పల్లిలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పండ్లరసం కొనిస్తానని చెప్పి.. తొమ్మిదేళ్ల బాలికను తీసుకువెళ్లిన ఓ ప్రబుద్ధుడు... ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పొట్టచేత పట్టుకుని మూడ్నెళ్ల క్రితం కుమార్తెతో కలిసి జక్రాన్‌పల్లికి వచ్చిన దంపతులు... శివారులో గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే భార్యబిడ్డను వదిలేసి భర్త వెళ్లిపోయాడు. సమీపంలో కూలీ పనులు చేసుకుంటూ కుమార్తెను పోషిస్తున్న మహిళ... రోజు మాదిరిగానే ఈనెల 22న బిడ్డను ఇంట్లో వదిలేసి పనులకు వెళ్లింది.

ఇదే అదునుగా భావించిన స్థానికుడు నారాయణ పండ్ల రసం కొనిస్తానని చెప్పి... బాలికను కొండ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. కూలీ పనుల నుంచి ఇంటికొచ్చిన తల్లి... బిడ్డ కనిపించకపోవటంతో సమీప ప్రాంతాల్లో వెతుకుతుండగా ప్రబుద్ధుడి దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... బాలికను ఆస్పత్రికి తరలించారు

ఇదీ చదవండి: 'కేంద్రమే నిధులిస్తే.. తెలంగాణ తరహా పథకాలు కర్ణాటకలో ఎందుకు లేవు?'

తల్లి చదివిన స్కూల్​కు హైటెక్​ హంగులు.. రూ.2కోట్లతో కొత్త భవనం

Last Updated : Apr 24, 2022, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.