ETV Bharat / crime

SEXUAL HARASSMENT ON TRAINEE SI: లైంగిక ఆరోపణలతో మరిపెడ ఎస్ఐపై సస్పెన్షన్‌ వేటు

author img

By

Published : Aug 3, 2021, 6:57 PM IST

Updated : Aug 3, 2021, 9:19 PM IST

maripeda si suspended
maripeda si suspended

18:55 August 03

మరిపెడ ఎస్ఐ శ్రీనివాస రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్​లో ఎస్​ఐగా పనిచేస్తున్న శ్రీనివాస​ రెడ్డి.. లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెండ్​ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వేగంగా జరిగిన పరిణామాలు చివరకు ఎస్​ఐ సస్పెన్షన్​కు దారి తీశాయి. ఇదే పోలీస్​ స్టేషన్​లో శిక్షణ పొందుతున్న మహిళా ఎస్ఐ... శ్రీనివాస రెడ్డి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ... వరంగల్​ పోలీస్​ కమిషనర్​ను ఆశ్రయించడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తన కుటుంబసభ్యులతో కలిసి సీపీ తరుణ్​జోషిని కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు. గత రాత్రి తనను అడవిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారని శిక్షణ మహిళ ఎస్​ఐ ఫిర్యాదుచేశారు. వెంటనే స్పందించిన సీపీ.. ఆరోపణలు రుజువైతే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.  

అనంతరం మహబాబాబాద్​ జిల్లా పోలీసు అధికారులు విచారణ ప్రారంభించారు. ఎస్​ఐ శ్రీనివాస​ రెడ్డిని అదుపులోకి తీసుకొన్న జిల్లా ఎస్పీ కోటిరెడ్డి.. విచారణ ప్రారంభించారు. వెనువెంటనే ఐజీ నాగిరెడ్డి సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు.  

ఉదయం రివార్డు అందుకొని.. 

ఈ ఉదయమే రివార్డు తీసుకున్న ఎస్​ఐ శ్రీనివాస​ రెడ్డి... సాయంత్రానికే సస్పెండ్ అయ్యారు. మంగళవారం తెల్లవారుజామున మూడు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 120 క్వింటాళ్ల నల్లబెల్లం, 4 క్వింటాళ్ల పట్టికను.. సీజ్​ చేసినందుకు.. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి చేతుల మీదుగా శ్రీనివాస​ రెడ్డి రివార్డు అందుకున్నారు. మహిళా ట్రైనీ ఎస్​ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సాయంత్రానికే సస్పెండ్ అయ్యారు.  

మహిళా కాంగ్రెస్​ ఆగ్రహం..

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆరోపించారు. దళిత ట్రైనీ ఎస్‌ఐపై.. అదే స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ అత్యాచారానికి యత్నించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. దళిత బంధు అంటున్న సీఎం కేసీఆర్ ఈ ఘటనతో సిగ్గుపడాలన్నారు. మహిళల సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి తమకు డీజీపీ అనుమతి ఇవ్వకపోవడం సరైంది కాదన్నారు.

దళితుల కోసం చట్టాలు చేయండి..

మరిపెడలో ట్రైనీ ఎస్ఐపై అత్యాచారయత్నం చేసిన ఎస్​ఐ శ్రీనివాస​ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మహబూబాబాద్ పట్టణంలోని అంబేడ్కర్​ విగ్రహం ముందు దళిత సంఘాలు ధర్నా చేశాయి. బాధితురాలికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. మరియమ్మ ఘటన మరవకముందే.. ఓ ట్రైనీ ఎస్ఐపై లైంగిక దాడికి యత్నించడం దారుణమన్నారు. దళితుల హక్కులు కాపాడేందుకు చట్టాలు చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీచూడండి: TRAINEE WOMAN SI COMPLAINT: మహిళా ట్రైనీ ఎస్సైని అడవుల్లోకి తీసుకెళ్లి... !

Last Updated : Aug 3, 2021, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.