ETV Bharat / crime

జూదంలో వివాదం.. మూకుమ్మడి దాడిలో వ్యక్తి మృతి

author img

By

Published : Jan 16, 2023, 3:45 PM IST

జూదంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కత్తులు, ఇనుపరాడ్లతో మూకుమ్మడిగా దాడి చేయడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడున్న వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

murder
murder

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా అవనిగడ్డలో కోడిపందేల బరి వద్ద దారుణం చోటుచేసుకుంది. బరి వద్ద ఏర్పాటు చేసిన జూదంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన వివాదం దాడికి దారి తీసింది. చిలికి చిలికి గాలివానలా మారినట్లు.. ఆ వివాదం కాస్త దాడి వరకు వెళ్లింది. ఈ దాడిలో ఓ వ్యక్తిపై కొందరు కత్తులు, ఇనుపరాడ్లతో మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి.. దాడి చేసిన వ్యక్తికి గతంలో వివాదాలు ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.

అసలు ఏం జరిగిందంటే..: కృష్ణా జిల్లా అవనిగడ్డలో కోడిపందేలు నిర్వహించారు. కోడిపందేలతో పాటు జూదాన్నీ ఏర్పాటు చేశారు. ఈ జూదంలో సీతాయిలంక వాసి అనిల్​ అనే వ్యక్తి పాల్గొన్నాడు. అతనితో పాటు గుంటూరు జిల్లా గొరికపర్రుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి కూడా ఆడాడు. జూదం ఆడుతున్న సమయంలో వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. అది కాస్త ముదిరి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరింది. దీంతో అనిల్​పై నాగరాజు దాడికి దిగాడు. ఇరువురు పరస్పరం ఇనుప రాడ్లతో, కత్తులతో దాడులకు దిగారు. నాగరాజు మరికొందరితో కలిసి అనిల్​పై దాడి చేశారు.

ఈ దాడిలో అనిల్​ తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలపాలైన అనిల్​ను ఘటనా స్థలంలో ఉన్న వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అనిల్​ ప్రాణాలు కోల్పోయాడు. అయితే నాగరాజుకు, అనిల్​కు మధ్య గతంలోనే వివాదాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు.

కోడికత్తి గుచ్చుకుని ఇద్దరు వ్యక్తులు మృతి..: ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు పెట్టినా కోడిపందేల నిర్వహణ ఆగడం లేదు. నిర్వాహకులపై కేసులు పెట్టినా.. కోడి పందేలు నిర్వహించే వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపడం లేదు. పైగా పందేల నిర్వహణలో రాజకీయ నాయకులు ఉంటుండటంతో వారిని ఎదురించేందుకు కొన్ని ప్రాంతాల్లో పోలీసులు వెనకడుగు వేయాల్సి వస్తోంది. మరికొన్ని ప్రదేశాల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. బాహాటంగానే పందేలు నిర్వహిస్తున్నా వారిపై చర్యలు చేపట్టేందుకు సాహసించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కోడిపందేల్లో కోడి కత్తి గుచ్చుకుని తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో ఆదివారం ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి:

ఈసారి డిజిటల్​కు మారిన కోడి పందేలు.. అంతా ఆన్​లైన్​లోనే...!!

జోరుగా కోడి పందేలు.. బౌన్సర్లతో రక్షణ.. బహుమతులుగా బుల్లెట్ బండ్లు, స్కూటీలు

కత్తి దూసిన పందెం కోళ్లు.. చేతులు మారిన కోట్లు.. లెక్కకురాని ఆంక్షలు

'ఒక శాతం ధనవంతుల చేతుల్లో 40% దేశ సంపద'.. ఆక్స్​ఫామ్​ రిపోర్ట్​లో ఆసక్తికర విషయాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.