ETV Bharat / crime

Murder: అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై నరికేశారు

author img

By

Published : Jun 25, 2021, 5:42 PM IST

ఏపీ విజయవాడలో పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. దుర్గా అగ్రహారంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో అత్యంత కిరాతకంగా నరికి చంపారు. బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

man
విజయవాడ

Murder: అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై నరికేశారు

ఏపీ విజయవాడలో పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. దుర్గా అగ్రహారంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో అత్యంత కిరాతకంగా నరికి చంపారు. బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఒళ్లంతా రక్తంతో తడిసిపోయింది. రోడ్డుపైనా రక్తపు మరకలు పడ్డాయి. చూస్తేనే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ ఘటన చుట్టుపక్కల వాళ్లనూ భయపెట్టింది.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, క్లూస్ టీం అధికారులు ఆధారాలు సేకరించారు. సమీపంలోని సీసీఫుటేజ్​ను పరిశీలిస్తున్నారు. ఆ దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి: Cong leaders: ప్రగతిభవన్​లో సీఎంను కలిసిన కాంగ్రెస్ నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.