తాగేందుకు డబ్బివ్వలేదని పెట్రోల్ పోసి భార్యకు నిప్పు

తాగేందుకు డబ్బివ్వలేదని పెట్రోల్ పోసి భార్యకు నిప్పు
Man Burnt His Wife Alive : భార్య సంపాదనపై ఆధారపడి బతికే ఓ భర్త తాగుడుకు బానిసయ్యాడు. మద్యం కోసం డబ్బు కావాలని తరచూ ఆమెతో గొడవపడుతుండే వాడు. అలా సోమవారం కూడా భార్యతో మద్యానికి డబ్బులు కావాలని వాగ్వాదానికి దిగాడు. ఆమె డబ్బు ఇవ్వకపోవడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్ చల్లి నిప్పంటించి పరారయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ మహిళ మృతి చెందింది.
Man Burnt His Wife Alive : తాగుడుకు బానిసైన ఓ భర్త డబ్బులు ఇవ్వలేదని భార్యను పెట్రోలు పోసి నిప్పంటించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. మైలార్‌దేవుపల్లి ఠాణా ఇన్‌స్పెక్టర్ నరసింహ, ఎస్సై కిష్టయ్య కథనం ప్రకారం.. లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్ప సముదాయాల్లో ఉండే మాస రాజు(56), అనితా బాయి(52) దంపతులు. కుమారుడు బాలుచందర్‌కి పెళ్లి చేశారు. అనితా బాయి ఉస్మానియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ లేబర్ స్వీపర్‌గా పనిచేస్తోంది. రాజు భార్య సంపాదన పైనే ఆధారపడి నిత్యం మద్యం కోసం డబ్బులివ్వమని వేధిస్తున్నాడు.
- ఇదీ చదవండి : మరో రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే యువతిని..
ఈనెల 8న మధ్యాహ్నం పెట్రోల్ డబ్బాతో ఇంటికొచ్చాడు. డబ్బుల కోసం భార్యతో గొడవపడ్డాడు. ఆమె ఇవ్వకపోవడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై చల్లి నిప్పంటించి పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కుమారుడు తల్లిని ఉస్మానియాకు తరలించాడు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది.
- ఇదీ చదవండి : ప్రైవేట్ బస్సును ఢీకొన్న బొలెరో.. ఒకరు సజీవదహనం
